డెబ్బై దశకం నుంచి సూపర్ హిట్స్ మూవీస్ వరసగా తీస్తూ వస్తున్న ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వనాధ్. ఆయన డెబ్బై దశకం చివరలో తీసిన అద్భుతమైన కళాఖండం శంకరాభరణం. తెలుగు చలన చిత్ర సీమకు అది కొండంత గర్వాన్ని ఇచ్చింది. టాప్ స్టార్స్ అంతా కూడా విశ్వనాధ్ ప్రతిభను శతవిధాలుగా మెచ్చుకున్న చిత్రమది.

ఆ తరువాత ఎన్టీయార్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన తన కుమారుడు బల‌క్రిష్ణను నట వారసుడిగా ముందుకు తెచ్చారు. మొదటి సినిమా సాహసమే జీవితం రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఆ తరువాత డిస్కో కింగ్ కూడా ఫెయిల్ అయింది. దాంతో ఎన్టీయార్ బాగా ఆలోచించి విశ్వనాధ్ తో బాలయ్య కాంబోని సెట్ చేశారు. హిట్ ఖాయమనుకున్నారు. ఈ మూవీయే జననీ జన్మభూమి. ఇది చక్కని కధ. బాగా డబ్బున్న యువకుడు తన ప్రాంతానికి మేలు చేయాలని తాపత్రయపడిన ఆదర్శవంతమైన కధ.

ఈ యువకుడి పాత్రలో బాలక్రిష్ణ నటించారు. ఆయనకు ఇద్దరు హీరోయిన్లు. సుమలత. రాజ్యలక్షి. ఇక శారద, సత్యనారాయ‌ణ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది. వేటూరి పాటలకు కెవి మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇక కధతో సహా అన్నీ విశ్వనాధే. దాంతో ఈ మూవీ సూపర్ హిట్ అని అంతా అనుకున్నారు. బాలయ్య కూడా చాలా బాగా నటించారు. కానీ ఈ మూవీ మాత్రం ఫెయిల్ అయింది. ఇందులో కమర్షియల్ వాల్యూస్ కంటే రియల్ వాల్యూస్ ఎక్కువ అయ్యాయి.

దాంతో మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య ఫ్యాన్స్ మెచ్చలేకపోయారు. ఇక ఈ మూవీ సరిగ్గా ఆడకపోవడంతో ఎన్టీయార్ వద్దకు చిత్ర యూనిట్ వెళ్ళేందుకు కూడా ఇబ్బంది పడిందట. అయితే విషయం తెలుసుకున్న ఎన్టీయార్ సినిమా చాలా బాగా తీశారు. ఫలితం మన చేతులలో లేదు అంటూ చిత్ర యూనిట్ ని అభినందించారుట. విశ్వనాధ్ ప్రతిభను కూడా కొనియాడారుట. మొత్తానికి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎన్టీయార్ మెచ్చడం విశేషం.  ఈ సంగతి పక్కన పెడితే ఎన్టీయార్ తో మూడు హిట్ సినిమాలు తీసిన చరిత్ర కూడా విశ్వనాధ్ కి ఉంది. ఏది ఏమైనా ఈ రోజుకీ టీవీలలో జననీ జన్మభూమి మూవీ  వస్తే ఇంత మంచి చిత్రం ఎందుకు ఫెయిల్ అయింది అని ఎవరికైనా అనిపించకమానదు.


మరింత సమాచారం తెలుసుకోండి: