సినిమా ఒక కళ. అదే వ్యాపారం. అదే జీవనం కూడా. సినిమా రంగంలో ఉన్న వారు ఒక్కటే మాట అంటారు. తమకు అదే తెలుసు అని. కాబట్టే నష్టమొచ్చినా లేక లాభమొచ్చినా అక్కడే తాము ఉంటామని చెబుతారు. అది నూటికి నూరుపాళ్ళు నిజమే.

చిత్రసీమలో భారీ నష్టాలు వచ్చిన వారు కూడా మళ్ళీ అక్కడే ఉండి వెతుక్కుంటారు. ఒక సినిమా పోతే మరో సినిమాలో కలసివస్తుంది అని ఆశ. ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న వ్యవహరం. ఇపుడు కూడా సినీ మేకర్స్ అలాగే భావిస్తున్నారుట. కరోనా వచ్చి ఏకంగా మొత్తానికి మొత్తం తారుమారు చేసేసింది. బడ్జెట్ రెట్టింపు అయింది. ఇక సినిమాలు చూసే పరిస్థితి లేదు. థియేటర్లలో రిలీజ్ చేసే సీన్ లేదు.

అవకాశం ఉంటే మంచి రేట్ వస్తే ఓటీటీకి విడుదల చేసుకునేవారు ఉన్నారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట చూస్తే  ప్రతీ భారీ చిత్రం మీద అప్పులు ఉన్నాయిట.  వడ్డీలు కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా పేరుతో తీస్తున్న సినిమాలకు అనూహ్యంగా బడ్జెట్ పెరిగిపోయింది. సినిమా అన్నది వ్యాపారం, టైమ్ కి తీసి రిలీజ్ కొట్టి కలెక్షన్లలో లాభాలు చూసుకోకపోతే కచ్చితంగా  అది లాస్ మూవీయే అవుతుంది. ఒక సక్సెస్ ఫుల్ మూవీ కూడా అనుకున విధంగా రిలీజ్ కాకపోతే మిగిలించేది కష్టాలు, నష్టాలే.

ఇపుడు పెద్ద సినిమాల పరిస్థితి అలాగే ఉంది. కరోనా మూడవ విడత లేకుండా కరుణిస్తే చాలా సినిమాలకు మోక్షం కలుగుతుంది. దాంతో పాటు తక్కువ నష్టంతో బయటపడతారు. అదే సమయంలో ఈ నష్టాల నుంచి ఒడ్డెక్కడానికి మరిన్ని సినిమాలు తీయడానికి టాలీవుడ్ మేకర్స్ రెడీ అవుతున్నారుట. ఈసారి అతికి పోకుండా వీలున్నంతవరకూ జోరుగా సినిమాలు తీసి రిలీజ్ చేస్తే ఈ కష్టాలు లేకుండా పోతాయని ఆలోచిస్తున్నారు భావిస్తున్నారుట. మరి ఈ లెక్కలతో టాలీవుడ్ లో ఇక మీదట వరసపెట్టి సినిమాల నిర్మాణమే జరుగుతుంది అంటున్నారు. ఇది ఒక విధంగా ఇండస్ట్రీ కళకళలాడానికి కూడా కారణం అవుతుంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: