వ‌కీల్ సాబ్ వాద‌న‌లో నిజం ఎంత ? : జ‌గ‌న్ నెగ్గారా? ప‌వ‌న్ నెగ్గారా?
లాయ‌ర్  పాత్ర లో అత‌డు
న‌ల్ల కోటు ఉన్నా లేకున్నా
ప్ర‌జ‌ల కోస‌మే అత‌డు
ఇలాంటి డైలాగ్ తోనే సినిమాలో విజిల్స్
తెప్పించాడు వేణు శ్రీ‌రామ్
ప‌వ‌న్ మాత్ర‌మే చేయ‌గ‌లిగిన పాత్ర
ఇదీ అభిమానుల మాట
ప‌వ‌న్ మాత్రమే సృష్టించ‌గ‌ల రికార్డు
ఇదీ అభిమానుల మాటే ...
మ‌రి ఈ సినిమా విష‌యంలో ఏపీ సీఎం నెగ్గారా ప‌వ‌న్ నెగ్గారా?


ఆ రోజు ఏం జ‌రిగిందో చూద్దాం... ఉన్న‌ట్టుండి టిక్కెట్ రేట్లు త‌గ్గించి ప‌వ‌న్ సినిమాపై త‌మ కోపం ప్ర‌ద‌ర్శించింది ఏపీ స‌ర్కార్.. అన్న ది జ‌న‌సేన మాట.. అదే నిజం కూడా అని త‌రువాత తేలిపోయింది..కానీ ఇప్పుడు మా సినిమా బుల్లి తెర‌పై అద్భుతం సృష్టించిం ది..ఇది మా గెలుపు..మంచి సినిమాకు ద‌క్కిన  గౌర‌వం అని జ‌న‌సేన, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాన సంఘాలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.



ఏదేమైన‌ప్ప‌టికీ ఏపీలో కొన్ని ఇబ్బందులు ఎదుర‌యినా క‌లెక్ష‌న్లు త‌గ్గినా థియేట‌ర్లు త‌గ్గినా ప‌వ‌న్ అభిమానులు మాత్రం ఈ సినిమా పై  పెంచుకున్న న‌మ్మ‌కాల‌ను మాత్రం వ‌దులుకోలేదు. కొన్ని సినిమాలు థియేట‌ర్ల ద‌గ్గ‌ర కొన్ని ఇబ్బందులు ప‌డినా బుల్లి తెర‌పై అవి చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు..అలా వ‌కీల్ సాబ్ వినిపించిన వాద‌న ఎంద‌రినో ఆక‌ట్టుకుంది.. ఎంద‌రినో ఆలోచింప‌జేసింది అంటూ.. ప‌వ‌న్ అభిమానులు సంతోషం  వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ప్ర‌సారం అయిన అన్ని సినిమాల్లో క‌న్నా ఈ సినిమా మంచి రేటింగ్ తెచ్చుకుంది. టికెట్ రేట్ల విష‌య‌మై ఏపీ స‌ర్కార్ త‌మ ను ఇబ్బంది పెట్టినా రాజ‌కీయ కోణంలో చూసి త‌మ అధినేత స్పందించారే కానీ అన‌వ‌స‌ర ఆగ్ర‌హాన్ని ఏనాడూ ప్ర‌ద‌ర్శించ‌లే ద‌ని ఓ విధంగా జ‌గ‌న్ నెగ్గార‌ని అను కున్నా ఇప్పుడు తాము నెగ్గామ‌ని భావిస్తున్నామ‌ని ప‌వ‌న్ అభిమాని ఒక‌రు వ్యాఖ్యానించారు.



ఇప్పుడీ సినిమా టీఆర్పీ రేటింగ్స్ లోనూ టాప్ లో ఉంది. నంబ‌ర్ ఒన్ స్థానం ద‌క్కించుకుంది. ఇటీవ‌లే జీ టీవీలో స్ట్రీమింగ్ అయిన వ‌కీల్ సాబ్ సినిమా టీఆర్పీ రేటింగ్ 32.20గా న‌మోదైంది. హిందీ పింక్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా క‌రోనా కార‌ణంగా థియే ట‌ర్ల ద‌గ్గ‌ర అనుకున్న వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోయింది. దీంతో దిల్ రాజుతో అంతా నిరుత్సాహ‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యం లోఇటీవ‌లే జీ - టీవీలో ప్ర‌సారం అయిన సినిమాకు అనూహ్య రీతిలో స్పంద‌న వ‌చ్చింది..ముఖ్యంగా మ‌హిళా ప్రేక్ష‌కుల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తాయి అని జ‌న‌సేన అభిమానులు ఆనందోత్సాహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: