మాస్ మహరాజ్ రవితేజ ఖిలాడి మూవీలో డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ తో మెప్పించాలని చూస్తున్నారు. అయితే ఇదివరకు రవితేజ చేసిన డ్యుయల్ సినిమాల పరిస్థితి గురించి చూస్తే విక్రమార్కుడు సినిమాతో రవితేజ కెరియర్ లో మొదటిసారి డ్యుయల్ రోల్ చేశాడు. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సెన్సేషనల్ హిట్ అందుకుంది. విక్రం రాథోడ్, అత్తిలి సత్తి రెండు పాత్రల్లో రవితేజ అదరగొట్టారు.

ఇక మరోసారి దరువు సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ చేశారు. ఆ సినిమాలో కూడా రవితేజ తన డ్యుయల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. దరువు సినిమా కూడా అంచనాలను అందుకుందనే చెప్పాలి. ఆ రెండు సినిమాల తర్వాత శ్రీను వైట్ల డైరక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఏకంగా ట్రిపుల్ రోల్ చేశాడు రవితేజ. అయితే ఆ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక మరోసారి రవితేజ ఖిలాడి సినిమాతో ద్విపాత్రాభినయంతో వస్తున్నాడు.

సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. ఖిలాడిలో రవితేజ డ్యుయల్ రోల్ లో దుమ్ముదులిపేస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ అందిస్తున్న మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. మరి మాస్ రాజా డ్యుయల్ సెంటిమెంట్ ఖిలాడికి వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత శరత్ మండవ డైక్షన్ లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఆ సినిమా కూడా రవితేజ కెరియర్ లో మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో రవితేజ సబ్ కలెక్టర్ రోల్ లో నటిస్తున్నాడట మాస్ రాజా. ఖిలాడి రిలీజైన వెంటనే ఆ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టనున్నాడు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: