స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా పుష్ప. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ ఊర మాస్ నటన అందరిని షాక్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

కన్నాడ భామ రష్మిక మందన్న పుష్ప సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక కూడా తన పాత్రతో అలరిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఆ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్ని లియోన్ ను దించే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది. అందుకోసం సన్నీకి 50 లక్షల దాకా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.

పుష్ప సినిమాలో ఐటం సాంగ్ ఆర్యలో  అ అంటే అమలాపురం, ఆర్య 2 సినిమాలో రింగ రింగ సాంగ్ ఈ రెండిటిని మించి ఈ పాట ఉంటుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ కంపోజిషన్ ఈ సాంగ్ ను దుమ్ముదులిపేస్తుందని అంటున్నారు. అంతేకాదు అమలాపురం, రింగ రింగ రెండు సాంగ్స్ ను మించి ఈ పాట ఉండేలా చూస్తున్నారట. తప్పకుండా అల్లు అర్జున్ అండ్ సుకుమార్ ఈ సినిమాతో మరోసారి మాస్ ఆడియెన్స్ ను మెప్పించే సాంగ్ తో వస్తున్నారని అంటున్నారు. పుష్ప పార్ట్ 1 లో ఐటం సాంగ్ మాములుగా ఉండదని అంటున్నారు. ఈ డిసెంబర్ లో పుష్ప సినిమా రిలీజ్ ఉంటుందని అంటుండగా ప్రస్తుతం సినిమా షూటింగ్ కు మళ్లీ బ్రేక్ పడటంతో సినిమా రిలీజ్ పై డౌట్ పడుతున్నారు. హడావిడి లేకుండా సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేలా చూసి 2022 సంక్రాంతికైనా సినిమాని రేసులో దించాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: