దేవుడ్ని న‌మ్మాలా న‌మ్మ‌కూడ‌దా?

నీ శ‌క్తి నీకు తెలియ‌జేసే న‌మ్మ‌కం

ఏదో ఒక‌టి ఈ విశ్వం అంతా ఉంది

నిన్ను నీవు నిరూపించుకునేందుకు

ఆ శ‌క్తీ ఆ న‌మ్మ‌కం నీకో అద‌న‌పు బ‌లం



మ‌నుషుల‌నూ దేవుడ్ని ఇలా వేరు చేసి చూడకండి.. మీలో ఉన్న గొప్ప శ‌క్తి ఏదో ఒక రోజు మిమ్మ‌ల్ని ఉన్న‌తుణ్ని చేస్తుంది.. అందాక మీ ప్ర‌య‌త్నం మీకే గొప్ప ఆనందం ఇస్తుంది.. కానీ నిద్ర పోతే ఫ‌లితాలు వ‌స్తాయా.. ఇలాంటి థాట్ సినిమా అంతా ఉంటుంది.. ప‌వ‌న్ న‌మ్మి ప్రేమించిన సినిమా.. కొన్ని మార్పులు కూడా బాగున్నాయి..తెర‌వెనుక ఎప్ప‌టినుంచో ఓ మ‌ల్టీ స్టారర్ ను అనుకుంటున్నారు ఇండస్ట్రీలో.. అది ప‌వ‌న‌కూ, వెంకీకీ సూట్ అయ్యే క‌థ‌.. ఓ మై గాడ్ స్క్రిప్ట్ ఈ ఇరువురినీ క‌లిపింది. మంచి ప్ర‌య‌త్నం ఒక‌టి మంచి ఫ‌లితం ఇస్తుంది అనేందుకు ఈ సినిమా తార్కాణంలా నిలిచింది. మార్కెట్లోకి కొత్త దేవుడు వ‌చ్చి చాలా కాల‌మైంది.. అన్న మాట టాప్ రేంజ్ లో పేలిపోయింది.. ఆ డైలాగ్ సెన్స్  ను చాలా మంది గుర్తు పెట్టుకున్నారు. సినిమాకు ఆశించిన క‌లెక్ష‌న్లు వ‌చ్చాయా లేదా అన్న‌ది అటుంచితే ప‌వ‌న్ న‌మ్మ‌కాల‌కూ, ఆయ‌న ప్రేమించే సిద్ధాంతానికి కాస్త ద‌గ్గ‌ర ఈ సినిమా.. దేవుడు క‌న్నా దేవుళ్లం అని చెప్పుకునే వాళ్ల‌కు ఈ దేశంలో కొంద‌రు ఎలా దాసోహం అవుతున్నార‌న్న‌ది ప‌ట్టి చూపిన సినిమా.. ఎవ్వ‌ర‌యినా అంతిమంగా ఎవ‌రిని వారు న‌మ్ముకోవాలి.. ఎవ‌రి శ‌క్తి ఎంత‌న్న‌ది తెల్సుకోవాలి.. డ‌బ్బులున్నా లేకున్నా లోప‌లి సంక‌ల్పం ఒక‌టి వెలుగులోకి తెచ్చేందుకు ఈ బొమ్మ‌లాట ప్ర‌తి ఒక్క‌రూ భాగం  కావాలి అన్న‌ది ఈ క‌థ‌కు అంతః సూత్రం.. ఈ బేసిక్ పాయింట్ ను సినిమా అంతా చెప్పేందుకు డైరెక్ట‌ర్ ప్ర‌య‌త్నిస్తాడు. వెంకీ ., ప‌వ‌న్ ఇద్ద‌రూ ఇమేజ్ ల జోలికి పోని చిత్రం.. ఆ ఊసెద్దండి సినిమా చేయండి చాలు అని డైరెక్ట‌ర్ డాలీ తో చేయించిన చిత్రం.ఏమ‌యినా కొన్ని సార్లు రావ‌డం లేట్ కావొచ్చు రావ‌డం మాత్రం ప‌క్కా.....

మరింత సమాచారం తెలుసుకోండి: