తెలుగు సినిమా చరిత్రలోనే కల్ట్ క్లాసిక్స్ సినిమాలుగా మిగిలిపోయే సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ సినిమాలను ఎప్పుడు చూసినా కూడా ప్రేక్షకులు ఎంతో ఆనందంగా వీక్షిస్తూ ఉంటారు. తమ జీవితాలలో భాగమైపోయిన సదరు సినిమాలు ప్రేక్షకులను ఎంతగా ఆదరిస్తారు అంటే మళ్ళీ మళ్ళీ చూసి తరించి పోయేలా వారికి నచ్చుతాయి.  అలా ఎన్టీఆర్ ఏఎన్నార్ కలిసి నటించిన తెలుగు సినిమా మర్చిపోలేని సినిమా గుండమ్మ కథ.

విజయా సంస్థ నిర్మించిన చిత్రాలలో విజయవంతమైన చిత్రం గుండమ్మ కథ. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ సార్ చిత్రం. ఇద్దరూ పెద్ద నటులు ఉన్నా కూడా సినిమా లోని ఒక క్యారెక్టర్ పేరు మీదుగా టైటిల్ పెట్టి సూపర్ హిట్ కొట్టడం విశేషం. గొప్ప వైవిధ్యం హాస్యం సంగీతం ఈ చిత్రానికి అద్భుతమైన విజయాన్ని అందించాయి. 1962 జూన్ 7న ఈ సినిమా విడుదల కాగా విడుదల కు ముందే ఎన్నో విమర్శలు చెలరేగాయి ఈ సినిమా చేస్తున్న సమయంలో. 

సినిమా విడుదల ఇంకా 10 రోజులు ఉంది అనగానే ఎల్.వి.ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకల్లో గుండమ్మ కథ సినిమా ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమా లో కథే  లేద ని సూర్యకాంతం గయ్యాళి తనాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ లేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్, విజయలక్ష్మి చేసిన పాత్రలు అవసరం లేదని విమర్శించారు. చివరికి మాయాబజార్ దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజు తో తన అభిప్రాయాన్ని చెబుతూ బాగా లేదని చెప్పారు. అయితే సినిమా విడుదలయ్యాక వారి అంచనాలు తలకిందులయ్యాయి. మొదట్లో పెద్దపెద్ద థియేటర్ లలో సైతం హౌజ్ ఫుల్ అయ్యింది. తర్వాత వారు జనాలు ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: