లాక్‌డౌన్ ప్రారంభ‌మైన నాటి నుంచి సినిమా రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌, ఆహా వంటివి వ‌చ్చి సినీ ప్రియుల‌ను ఆక‌ట్టుకుంటోంది.  సినిమా ప్రేక్ష‌కుల‌ను కాలు బ‌య‌ట పెట్ట‌కుండా ఇంట్లోనే సినిమాలు చూసేట‌ట్టు చేస్తున్నాయి. టీవీల‌కే క‌ట్టిప‌డేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఓటీటీ హ‌వా న‌డుస్తోంది. ప్ర‌తి ఒక్క సినిమాను ఇప్పుడు అంద‌రూ ఓటీటీలోనే చూస్తున్నారు. ఏ సినిమా విడుద‌ల సిద్ధ‌మైన అది ఓటీటీ లేక థియేట‌ర్ అని అడుగుతున్నారు. ఓటీటీ రావ‌డంతో థియేట‌ర్ల‌కు వెళ్లే వారి సంఖ్య త‌గ్గింది. థియేట‌ర్లు న‌డ‌వ‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుతం విడుద‌లయ్యే సినిమాల‌ను ఓటీటీలోనే విడుద‌ల చేస్తున్నారు.  ఆ త‌ర‌హాలోనే నితిన్ హీరోగా నటిస్తున్న మాస్ట్రో చిత్రం విడుదల పై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 ఈ చిత్రం ఇదివ‌ర‌కే షూటింగ్ పూర్త‌యింది. అయితే ద‌ర్శ‌క, నిర్మాత‌లు సినిమాను విడుద‌ల చేసేందుకు స‌మాలోచ‌న‌లో ప‌డ్డారు. ఇప్పుడే థియేట‌ర్లు ప్రారంభం కావ‌ని, ఒక‌వేళ ప్రారంభ‌మైన 50శాతంతో థియేట‌ర్లు న‌డిపిస్తార‌ని ఆలోచిస్తున్నారు. దాంతో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేయాల‌ని ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుత స‌మాచారం ప్రకారం ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చిత్ర నిర్మాతలతో ఒక ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసిన‌ట్లు కూడా స‌మాచారం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి స‌మాచారం తెలుప‌నున్నారు.
 
అయితే ఒప్పందం ప్రకారం మాస్ట్రో చిత్రం ఆగస్ట్ 15వ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ప్ర‌సారం చేయాల‌ని నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్ర నిర్మాతల నుండి వెలువ‌డ‌డ‌మే త‌రువాయి. అతి త్వరలో ఈ విష‌యాన్ని చెప్ప‌నున్నారు. నితిన్ సరసన అంద‌మైన తమన్నా భాటియా, నబ్బా నటేష్లు కథానాయికలుగా న‌టిస్తున్నార‌నే విష‌యం మ‌న‌కు తెలిసిందే. ద‌ర్శ‌కుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తీశారు. చూడాలి మరి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: