టాలీవుడ్ లో అక్క, వదిన లాంటి క్యారెక్టర్లతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఇదివరకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సురేఖ వాణికి ప్రస్తుతం కాస్త అవకాశాలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. దానికి కారణం సీనియర్ హీరోయిన్లు కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో సురేఖ వాణి లాంటి న‌టీమ‌ణులకు చాన్స్ లు లేకుండా పోయాయి. ఇక‌ సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టినప్ప‌టికీ సోషల్ మీడియాలో సురేఖా వాణి క్రేజ్ అంతా ఇంతా కాదు. గ్లామర్ ఫోటోలతో సురేఖవాణి ఎంతోమంది సోషల్ మీడియా అభిమానులను సంపాదించుకుంది. కాగా సురేఖ వాణి వార‌స‌త్వంగా ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియా సెలబ్రెటీ అయిపోయింది. 

ఇప్పటివరకు ఒక్క సినిమా చేయకపోయినా ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. తన తల్లి సురేఖవాణి తో కలిసి చేసిన టిక్ టాక్ వీడియోలతో సుప్రీత మొదట అభిమానుల్ని సంపాదించుకుంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ రావడంతో రెచ్చిపోతోంది. లైవ్ వీడియోలు..హాట్ ఫోటో షూట్ ల‌తో మ‌రింత క్రేజ్ సంపాదించుకుంటోంది. అంతేకాకుండా కొన్ని యాడ్ షూట్ లు కూడా చేస్తూ సుప్రీత చేతినిండా డబ్బులు సంపాదిస్తోంది. ఇక సురేఖ వాణి కూడా తన కూతురి సక్సెస్ పట్ల ఎంతో హ్యాపీగా ఉంది.

అంతేకాకుండా త్వరలోనే కూతుర్ని హీరోయిన్ గా చూడాలని సురేఖవాణి కోరుకుంటుంది. ఇక‌ సుప్రీత సోషల్ మీడియా ఫాలోయింగ్.... ఆమె గ్లామర్ డోస్ చూస్తుంటే త్వరలోనే హీరోయిన్ ఖచ్చితంగా అవుతుందని అనిపించేలా ఉంది. దానికి కారణం సుప్రీత రోజురోజుకు సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలలో గ్లామ‌ర్ షో పెంచేయ‌డ‌మే. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో సుప్రీత హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసింది. ఎద అందాలు కనిపించేలా సుప్రీత ఫోటోలు అభిమానులు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో సుప్రీతను చూస్తుంటే హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోకుండా ఉంది. దాంతో అభిమానులు సూప‌ర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: