1999 జులై 26వ తేదీన అధికారికంగా ఆపరేషన్ విజయ్ విజయవంతం అయ్యిందని ప్రకటించింది భారత ప్రభుత్వం. ఇందులో దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ కోసం జరిగిన యుద్ధంలో మరణించడం జరిగింది. ఇక ఇందులో వీరమరణం పొందిన వారి జ్ఞాపకార్థంగా కార్గిల్ లో ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ పై మనదేశం పోరాడి కార్గిల్ ను తిరిగి తెచ్చుకుంది. ఈ కార్గిల్ యుద్ధం జరిగి నేటికి 22 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఇక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రీల్ హీరోలు ఎంతమంది రియల్ లైఫ్ హీరోలను ఆధారంగా తీసుకొని, తెరకెక్కిన చిత్రాలు చాలానే ఉన్నాయి.ఇక ఆ చిత్రాలు ఏంటి..? ఆ హీరోలు ఎవరు..? అనే విషయం తెలుసుకుందాం.


1. సరిలేరు నీకెవ్వరు - మహేష్ బాబు:
మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా , ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని మెప్పించాడు.


2. వెంకీ మామ , లాల్ సింగ్ చద్దా  - నాగ చైతన్య:
మొట్టమొదటిసారిగా నాగచైతన్య ఈ సినిమాలో సైనికుడు పాత్రలో నటించాడు. అలాగే లాల్ సింగ్ చద్దా సినిమాలో  అమీర్ ఖాన్ తో  కలిసి నాగచైతన్య సైనికుడి పాత్రల్లో అలరించనున్నాడు.

3. నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా - అల్లు అర్జున్:
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో ప్రేక్షకులను అలరించాడు.

4. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ - ఆది సాయి కుమార్:
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా లో ఎన్ ఎస్ జి కమాండో పాత్రలో సూపర్ హిట్ గా నటించాడు అని చెప్పవచ్చు.

5. యుద్ధభూమి - మోహన్ లాల్ ,అల్లు శిరీష్:
వీరిద్దరూ కూడా ఈ సినిమాలో సైనికుడు పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

6. మేజర్ - అడవి శేషు:
ఇటీవల 26/ 11 దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.

7. శ్రీశైలం - శ్రీ హరి:
ఈ చిత్రంలో శ్రీహరి ప్రముఖ మిల్ట్రీ ఆఫీసర్ గా మనకు కనిపించాడు..

వీరే కాకుండా మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాని, నాగార్జున అంటే ఎంతో మంది హీరోలు సైనికుల పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: