సూపర్ స్టార్ మహేష్ తో ప్రస్తుతం పరశురామ్ పెట్ల తీస్తున్న సినిమా సర్కారు వారి పాట. యువ భామ కీర్తి సురేష్ తొలిసారిగా సూపర్ స్టార్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమా భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతుండగా దీనిని 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాతలు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. దీని అనంతరం త్రివిక్రమ్ తో హారికా హాసిని క్రియేషన్స్ వారి మూవీ చేయనున్నారు మహేష్.
ఆపై దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమాలో నటించనున్న మహేష్, అందులో ఇప్పటివరకు పోషించని ఒక అద్భుతమైన పాత్రలో కనిపించనున్నారని, అలానే ఆ మూవీని సౌత్ ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగె భారీ అడ్వెంచరస్ మూవీ గా రాజమౌళి తీయనున్నారు అని కొద్దిరోజులుగా పలు కథనాలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా పలు టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న న్యూస్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఇప్పటికే హాలీవుడ్ నటి గాల్ గ్యాడట్ హీరోయిన్ గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు టాక్.

నిజానికి ఈ విషయమై కొద్దిరోజులుగా దర్శక నిర్మాతల మధ్య ఒకింత చర్చలు సాగుతున్నాయని, ఈ మూవీని ఎంతో భారీ స్థాయిలో నిర్మించాలని సంకల్పించిన రాజమౌళి ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాదల్చుకోలేదట. అందుకే వండర్ వుమన్ భామ గాల్ గ్యాడట్ ని ఎంపిక చేశారట. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా గురించిన పూర్తి సమాచారం మీడియా ముఖంగా అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ ముగింపు పనుల్లో ఉన్నారని, అవి పూర్తి కాగానే మహేష్ మూవీ గురించిన పూర్తి వివరాలు స్వయంగా వెల్లడిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే తొలిసారిగా హాలీవుడ్ భామ గాల్ గ్యాడట్ టాలీవుడ్ రంగప్రవేశం ఖాయం అనే చెప్పాలి .... !!

మరింత సమాచారం తెలుసుకోండి: