నాచురల్ స్టార్ నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీ పిర్జాదా కౌర్. మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్న అమ్మడు ఈమధ్య భవ్య భిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకుని పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది మెహ్రీన్. పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదు అన్న కండీషన్ పెట్టేసరికి అమ్మడికి అది నచ్చక ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లిని రద్దు చేసుకుంది.

ఇక పెళ్లి వద్దనుకున్న అమ్మడు సినిమాల మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటుంది. ఇప్పటికే మారుతి డైరక్షన్ లో మంచి రోజులు వచ్చాయి సినిమాలో నటించింది మెహ్రీన్ కౌర్. ఎఫ్43 సినిమాలో కూడా మెహ్రీన్ నటిస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత కెరియర్ లో మళ్లీ జోరందుకుంటుందని అంటున్నారు. ఎఫ్ 3 ఎలాగు మళ్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. ఇక మంచి రోజులు వచ్చాయి సినిమా మారుతి డైరక్షన్ లో అలరించడానికి వస్తుంది.

సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న ఈ సినిమా కూడా మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది. లేటెస్ట్ గా రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక మీద తన పూర్తి ఫోకస్ సినిమాల మీదే పెట్టి వచ్చిన ప్రతి ఛాన్స్ చేయాలని చూస్తుంది మెహ్రీన్ కౌర్. ఆ మధ్య సీనియర్ హీరో నందమూరి నట సిం హం బాలయ్య బాబు సినిమాలో ఛాన్స్ వచ్చిందని అన్నారు. కాని తాను చెప్పే వరకు తను చేస్తున్న సినిమాల గురించి వార్తలు రాయొద్దని అమ్మడు మీడియాకు వెళ్లడించింది. ఫైనల్ గా మెహ్రీన్ కౌర్ మళ్లీ తెలుగులో బిజీ హీరోయిన్ అవ్వాలని చూస్తుంది. అందుకే వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అమ్మడు ఓకే చెబుతుంది. సంతోష్ శోభన్ హీరోగా వస్తున్నా సినిమాలో కూడా మెహ్రీన్ చేస్తుంది అంటే ఇక మీద స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందని అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: