టాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రమే కాదు దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలు కూడా ఎంతో కమర్షియల్ గా నడుస్తుంటాయి. సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరు కమర్షియల్ గా వ్యవహరిస్తూ భారీ పారితోషికం అందుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోలు కోట్లలలో పారితోషకం తీసుకుంటారు.  ఈమధ్య ప్రతి ఒక్క హీరో కోట్లల్లో పారితోషకం అందుకుంటుండడం తో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఒక సినిమా హిట్ కావాలన్నా, బాగా ఆడీ డబ్బు లు వెనక్కి రావాలన్నా హీరో ని బట్టే ఉంటుంది.  ఈ నేపథ్యంలో హీరోల రెమ్యునరేషన్ కోట్లలో ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదని సినిమా జనాలు అంటున్నారు.

ఆ విధంగా సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో లుగా ఉన్న వారు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. గతంలో హీరోలకు సినిమాలు మాత్రమే చేయడం తెలుసు. రకరకాల కోణాల్లో ప్రయోగాలు చేస్తూ సినిమాలు తీసేవారు. క్షణం తీరిక లేకుండా సినిమాలతోనే 24 అవర్స్ గడిపేవారు. ఫ్రీ గా ఉన్నప్పుడు కాల్ షీట్స్ ఇస్తూ డబ్బులు సంపాదించుకునే వారు.  కేవలం సినిమాలపైనే డబ్బు ను సంపాదించేవారు.  ఇతర విధాలుగా డబ్బును సంపాదించే వారు కాదు. కానీ కాలం మారింది ఇప్పుడు ఫేమ్ వస్తే చాలు యాడ్స్ చేయడం మొదలుపెట్టారు. 

మెగాస్టార్ చిరంజీవి నాగార్జున వెంకటేష్ హయాం నుంచి ఈ ఇతర సైడ్ ఇన్ కం పై దృష్టి పెడుతున్నారు మన హీరోలు. ఒక్కొక్క ప్రకటనకు పెద్ద పెద్ద హీరోలు 10 కోట్ల రూపాయలు వరకు సంపాదిస్తున్నారు. చిన్న హీరోలు సైతం డబ్బు సంపాదించడం పై దృష్టి పెట్టి వారికి తగ్గ కమర్షియల్స్ లో నటిస్తున్నారు. కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రోడక్టులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ గట్టిగానే డబ్బు సంపాదిస్తున్నరు మన హీరోలు. ఇవే కాకుండా మన హీరోలు తమ సోషల్ మీడియా ద్వారా కొన్ని కొన్ని ప్రొడక్ట్ లను ప్రమోట్ చేస్తూ ఉంటారు వాటికి కూడా సపరేట్ గా డబ్బులు వసూలు చేస్తారట.ఇక బుల్లితెరపై రెమ్యునరేషన్ మన హీరోలు ఐదు కోట్లు పైగానే చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: