పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ లో వచ్చే ఆ జోష్ వేరేలా ఉంటుంది. పవన్ ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్ర తాలూఖా స్టైల్ మార్చేస్తాడు. ఆ క్యారక్టరైజేషన్ కు కలరింగ్ అద్దుతాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఖాకీ డ్రెస్ వేస్తే మాత్రం అదిరిపోవాల్సిందే. గబ్బర్ సింగ్, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ వేశారు. పోలీస్ గా పవన్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. గబ్బర్ సింగ్ అయితే అప్పటివరకు ఉన్న పవర్ స్టార్ సినిమాల రికార్డులన్ని చెరిపేసి కొత్త రికార్డులు సృష్టించింది.

ఇక లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమాలో కూడా పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఏకే రీమేక్ ను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చేస్తున్నారట. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తెలుగు వర్షన్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రం చేస్తున్నాడని తెలిసిందే. ఒరిజినల్ వర్షన్ లో బిజూ మీనన్ వేసిన పాత్రలో పవన్ కనిపించనున్నారు. అయితే తెలుగులో పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని సినిమాలో ఈ పాత్ర వెయిట్ పెంచుతున్నారట.

మాత్రుక సినిమాలో పాత్ర కన్నా ఏకే తెలుగు రీమేక్ లో పవన్ పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది. సినిమాలో పవన్ భీంలా నాయక్ అనే పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. లేటెస్ట్ గా సినిమా షూటింగ్ మళ్లీ మొదలవగా పవన్ ఖాకీ లుక్ తో ఉన్న పిక్స్ లీక్ అయ్యాయి. భీంలా నాయక్ గా పవర్ స్టార్ మరోసారి అదరగొట్టడం ఖాయమని చెపొచ్చు. ఈ సినిమాలో పవన్ తో పాటుగా దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. పవన్, రానాల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: