బాలీవుడ్ లో ప్రస్తుతం చెలరేగుతున్న పోర్నోగ్రఫీ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పై ఎన్నో ఆరోపణలు నెలకొన్న నేపథ్యంలో ఆయనను ఇటీవలే పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితులు స్నేహితులు అందరిని విచారణ చేస్తున్నారు. ఇటీవలే రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టి ని కూడా పోలీసులు ఆరు గంటలపాటు విచారించగా ఆ విచారణలో శిల్పాశెట్టి తన భర్త నేరస్తుడు కాదని తెలియజేసినట్లు తెలుస్తుంది.

ఇండస్ట్రీకి వచ్చే మోడల్స్ ను సినిమా షూటింగ్ అని చెప్పి పోర్న్ సినిమాలు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నాడని ఆయనపై పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుంద్రా అరెస్టు అయిన తర్వాత బాలీవుడ్ లో ఎంతో మంది దీన్ని చర్చకు తీసుకు వస్తున్నారు. దీనిపై 2005 గ్రేట్ ఇండియన్ లోఫర్ చాలెంజ్ గెలిచిన కమెడియన్ సునీల్ పాల్ తనదైన శైలిలో స్పందించారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ మీద వచ్చే సినిమాలకు వెబ్ సీరీస్ లకు కూడా సెన్సార్షిప్ ఉండాలని చాలా ఆరోపణలు వినిపించాయి.కానీ ఇప్పటివరకు ఏదీ జరగలేదు.

ఏం జరిగిందో జరిగిపోయింది తప్పదు కాబట్టి జరగబోయేది ఆలోచించాలి. పెద్ద పెద్దవాళ్ళు ఇప్పుడు చేసే సినిమాలకు, వెబ్ సేరీస్ లకు సెన్సార్షిప్ లేదు. కాబట్టి దానిని విపరీతంగా వాడుకుని సెక్స్ సన్నివేశాలు ఎక్కువగా పెట్టీ డబ్బు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న ఏ వెబ్ సిరీస్ లో ఇంట్లో కూర్చుని అయితే చూడలేము. ప్రత్యేకించి మనోజ్ బాజ్ పాయ్ ఫ్యామిలీ మెన్, మిర్జా పూర్ లాంటి నటులు నటించిన వెబ్ సిరీస్ లను చూడలేకపోతున్నాం. అతను ఎంత పెద్ద యాక్టర్ అయినప్పటికీ దేశం ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం చేసినటువంటి ఫ్యామిలీ మ్యాన్ లాంటి సినిమాలను అయితే ఇంట్లో ఫ్యామిలీతో కూర్చుని చూడలేము.

మరింత సమాచారం తెలుసుకోండి: