రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ‛ఖిలాడి' మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే..కరోనా సెకండ్ వేవ్ కరణం గా ఇంకా ఈ మూవీ షూటింగ్ పూర్తి కాలేదు.షూటింగ్ పూర్తి కాని ఈ గ్యాప్ లో శరత్ మండవ దర్శకత్వంలో రామారావు అనే మూవీ స్టార్ట్ చేశారు రవితేజ.రీసెంట్ గానే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.రామారావు మూవీ లో రవితేజ ఎమ్మార్వో గా నటిస్తున్నారు.ఈ సంగతి ఇలా ఉండగా... కరోనా వల్ల ఆగిన ఖిలాడి మూవీ షూటింగ్ నేటి నుండి ప్రారంభించారు.ఈ మూవీ లో రవితేజ కాకుండా అనేక మంది నటీనటులు ఉన్నారు. 

వారి పై కొన్ని సన్నివేశాలను తియ్యనున్నారు.త్వరలోనే రవితేజ కూడా షూటింగ్ కు రానున్నారు.ఖిలాడి మూవీ లో హీరో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా  నటించనున్నారు.ఈ మూవీ లో అనసూయ కూడా కనిపించనుంది.ఇక ఈ మూవీ లో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించారా...? లేదా ఒకరే ఇద్దరా  అన్నదే ట్విస్ట్. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాలో ప్రణీత ఒక ప్రత్యేక సాంగ్ కి నటిస్తున్నారు అని సమాచారం. ప్రణీత ఇప్పటికే టాప్ హీరోస్ అయిన పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో నటించింది. 

ఇక సంక్రాంతి కి వచ్చిన రవితేజ క్రాక్ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన ఈ క్రాక్ సినిమా తో  మళ్ళీ రవితేజ కి పూర్వ వైభవం వచ్చింది.ఇక ఈ సినిమా లో శృతిహాసన్ హీరోయిన్ నటించగా ఆమెకు ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చింది.క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నటిస్తున్న సినిమా కావడంతో ఖిలాడి పై భారీ అంచనాలు ఉన్నాయి .ఇక వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు రవితేజ...!!

మరింత సమాచారం తెలుసుకోండి: