దర్శకుడుగా రాణించడం అంటే అంత ఈజీ కాదు. ఒక సినిమాను పూర్తిస్థాయిలో హ్యాండిల్ చేయడం అందులోనూ పెద్ద బడ్జెట్ సినిమాలను హ్యాండిల్ చేయడం అందరికీ చేతకాదు. కొంతమంది అనుభవం ఉన్న దర్శకులకు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. అలా టాలీవుడ్ లో వెరైటీ దర్శకుడిగా మాస్ ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు బాబీ. తొలుత సినిమా ఇండస్ట్రీకి రచయితగా పరిచయమై ఆ తర్వాత రవితేజ నటించిన పవర్ సినిమా తో దర్శకుడిగా మారాడు. డాన్ శీను, బాడీగార్డ్, ఓ మై ఫ్రెండ్ వంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన బాబీ బలుపు సినిమాకు, అల్లుడు శీను సినిమాకు కథ అందించాడు.

ఈ నమ్మకంతోనే రవితేజ దర్శకుడిగా తొలి చాన్స్ బాబీకి ఇవ్వగా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత వెంటనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ అందుకున్నాడు కానీ ఆ సినిమా ఆయనకు భారీ ఫ్లాప్ ను తెచ్చిపెట్టింది.  ఆ సినిమా నుంచి కోలుకొని ఎన్టీఆర్ తో మూడు విభిన్న పాత్రల్లో జై లవకుశ సినిమా చేసి మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. ఇటీవలే ఆయన దర్శకత్వం వహించిన వెంకీ మామ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మాస్ సినిమాలకు కుటుంబ కథలను అల్లి ప్రేక్షకులను మెప్పిస్తున్న బాబీకి తర్వాత సినిమాకి మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు. 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఆయనను దృష్టిలో పెట్టుకుని మాంచి మాస్ మసాలా స్క్రిప్ట్ రెడీ చేశారట. కథ వినగానే రెండో మాట లేకుండా చిరంజీవి ఓకే చెప్పేసారు అని తెలుస్తుంది. అయితే ఇటీవల టాలీవుడ్ లో ఈ సినిమా కథ అంతకుముందే విజయ్ దేవరకొండ కు బాబీ చెప్పాడని విజయ్ కూడా బాగా ఇంప్రెస్ అయినా విజయ్ తన సినిమాల బిజీ షెడ్యూల్ కారణంగా వదులుకోవాల్సి వచ్చిందని, రెండు సంవత్సరాల వరకు డేట్స్ లేకపోవడంతో అంతవరకు వెయిట్ చేసే ఉద్దేశం బాబీకి లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి కి షిఫ్ట్ అయ్యాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో కి రాసుకున్న ఈ కథ తో మెగాస్టార్ చిరంజీవిని ఎలా ఒప్పించాడు అనేది ఇక్కడ అందరూ ఆశ్చర్యపోతున్న విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: