తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఒక దర్శకుడు ఒక హీరోయిన్ కు రెండు మూడు సినిమాల్లో ఛాన్స్ ఇస్తేనే వాళ్ళిద్దరి మధ్య ఏవేవో లింకులు ఉన్నట్టు ఒకటే ప్రచారం జరుగుతుంది. ఎంత మంచి ద‌ర్శ‌కుడు అయినా.. ఎన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు ఇచ్చినా హీరోయిన్‌ను రిపీట్ చేస్తే చాలు గాసిప్ రాయుళ్లు ఏవేవో లింకులు పెట్టి తెగ రాసేస్తూ ఉంటారు. అలాంటిది ఒకే దర్శకుడు ఓకే హీరోయిన్ కు 20 - 30 సినిమాల్లో అవకాశం ఇచ్చాడు అంటే వారిద్దరి మధ్య సంబంధం గురించి ఈ లోకం ఎలా కోడై కూస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే స్టార్ హీరోలు , స్టార్ దర్శకులు సంవత్సరానికి ఒకటికి మించి సినిమా చేసే పరిస్థితి లేదు.

ఎంత పెద్ద హీరో అయినా, ద‌ర్శ‌కుడు అయినా సంవ‌త్స‌రానికి ఒక సినిమా మించి చేస్తే గొప్ప అన్న‌ట్టుగా ఉంటోంది. మ‌న యంగ్ హీరోలు, ద‌ర్శ‌కులు అయితే ఇప్పుడు మ‌రీ ఏకంగా రెండేళ్ల‌కు ఒక్క సినిమాయే చేస్తున్నారు. కానీ అప్పట్లో ఒక దర్శకుడు - హీరో కాంబినేషన్లో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చేవి. అలాగే దర్శకులు పలువురు హీరోలతో సినిమాలు చేసినప్పుడు ఒకే హీరోయిన్ ను ఎక్కువగా రిపీట్ చేయడం కూడా జరిగేది. ఈ క్రమంలోనే తెలుగు సినిమాకు పెద్ద దిక్కుగా ఉన్న నాటితరం దర్శకుడు.. ఒక నేచురల్ హీరోయిన్ కు తన సినిమాల్లో పదేపదే అవకాశాలు ఇచ్చే వారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ హాట్ గా ప్రచారం జరిగింది.

విచిత్రం ఏంటంటే ఆ టాప్ దర్శకుడు ఆ నేచురల్ హీరోయిన్ చెల్లిని కూడా హీరోయిన్‌ను చేశారు. తన సినిమాల్లో అవకాశం ఇవ్వటం ద్వారా అక్క తో పాటు చెల్లికి కూడా లైఫ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ఏవో సంబంధాలు ఉండేవి అని ఆ త‌రం సినీ అభిమానుల్లో ఎక్కువగా వినిపించేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: