పాతికేండ్లు దాటితే పెళ్లెప్పుడు అని సాధార‌ణంగా ఎవ‌రైనా అడుగుతారు. ఎందుకంటే ఆ వ‌య‌సు వ‌చ్చిందంటే పెళ్లి స‌మ‌యం వ‌చ్చింద‌ని అర్థం. అందులో అమ్మాయి అయితే మ‌రీనూ.. ఎప్పుడు ప‌ళ్లి చేసుకుంటార‌ని ఒక‌టే గోల పెడుతారు. ఎందుకంటే పెళ్లి, పిల్ల‌ల‌తోనే అమ్మాయిల జీవితం ప‌రిపూర్ణం అవుతుందంటారు. అయితే దీనికి విరుద్దంగా సినిమా రంగం ఉంటుంది. 40 ఏండ్లు దాటిపోయినా పెళ్లి పెటాకులు లేకుండా ఉన్న వాళ్లు చాలా మందే చిత్ర సీమ‌లో మ‌న‌కు క‌న‌బ‌డుతుంటారు. అందులో కొంత మంది ఎప్ప‌టికీ సింగిల్ గానే ఉంటామంటున్నారు. వారిలో కొంద‌రి గురించి తెలుసుకుందాం..

ట‌బు..
    90 వ ద‌శ‌కంలో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగిన క‌థా నాయికల్లో టబు ఒకరు. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ త‌న సత్తా చాటిందీ ఆమె.. వృత్తిపరంగా అద్భుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ 50 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. జంటగా ఉంటేనే సంతోషంగా ఉంటారంటే నేను నమ్మనని ఎందుకంటే సంతోషమనేది కేవలం రిలేషన్‌షిప్‌లోనే దొరకదని చెప్పింది.

త‌నిషా..
 ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ సోదరిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ త‌నిషా 43 ఏళ్లున్న ఈమె తన 39 ఏళ్ల వయసులో అండాలను భద్రపరచుకున్నట్లు ఇటీవ‌ల చెప్పింది. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన 'కంత్రి' సినిమాలోనూ నటించింది త‌నిషా. "మహిళల జీవితంలో రిలేషన్‌షిప్‌, పెళ్లి, పిల్లలు అనేవి కేవలం ఒక భాగం మాత్రమేన‌ని అదే త‌మ‌ పూర్తి జీవితాన్ని నిర్వచిస్తాయనడం నిజం కాదంది.


సుస్మితా సేన్‌..
   విశ్వసుందరిగా, నటిగా, మోడల్‌గా ఎందరికో సుపరిచితురాలైన సుష్మితా సేన్‌ పాతికేళ్ల వయసులోనే, అది కూడా పెళ్లి కాకుండానే 'రెనీ' అనే చిన్నారిని దత్తత తీసుకుంది. ఆ త‌రువాత కొన్నేళ్లకు అలీషాను దత్తత తీసుకుని ప్రస్తుతం సింగిల్ మదర్‌గా వీరి ఆలనాపాలనను దగ్గరుండి చూసుకుంటోంది. తాను అందరి అభిప్రాయాలను గౌరవిస్తానని, ప్రస్తుతం సింగిల్‌గానే ఎంతో సంతోషంగా ఉంటున్నాని ఓ సంద‌ర్భంలో వివ‌రించింది.


శోభన..
   80, 90ల్లో హీరోయిన్‌గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన శోభన. ఉత్తమ నటిగా రెండుసార్లు జాతీయ పురస్కారం అందుకుంది.  51 సంవత్సరాలు ఉన్న ఈమే కేవలం పెళ్లి మాత్రమే సంతోషాన్నిస్తుంది అనుకోవడం పొరపాటు, దాని కంటే కూడా జీవితంలో సంతోషం పంచే విషయాలు చాలానే ఉన్నాయ‌ని ఓ సంద‌ర్భంలో పేర్కొంది.

  దివ్య దత్తా..
  వీర్‌ జారా, వెల్‌కం టు సజ్జన్పూర్‌, 'దిల్లీ-6', 'భాగ్‌ మిల్కా భాగ్‌' సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న‌ దివ్య దత్తా. వృత్తిపరంగా ఎన్నో విజయాలు సాధించింది. ఈమె 43 ఏళ్లు దాటినప్పటికీ వివాహం చేసుకోలేదు.


అమీషా పటేల్..
త‌న జీవితంలో నా ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకునేవాడు మాత్రం దొరకలేదు. అందుకే పెళ్లి గురించి ఆలోచించడం లేదని అమీషా ప‌టేల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. 'బద్రి', 'నాని', 'నరసింహుడు' చిత్రాలతో తెలుగు సినీమాలో న‌టించింది. తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సత్తా చాటిన‌ అమ్మడి వయసు 46 ఏళ్లు. అయినా పెళ్లి మాట మాత్రం తీయ‌డం లేదు.

నగ్మా..
ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నటిగా వెలుగొందింది నగ్మా. హిందీ, కన్నడ, పంజాబీ, మరాఠీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకుంటుంది. ఈ  46 తార. ఇంత వ‌య‌సు ఉన్నా ఏడడుగులు వేసేందుకు ఎందుకో ఆసక్తి చూపడం లేదు.

సితార..
సితార 'శ్రీమంతుడు', 'భలే భలే మగాడివోయ్‌', 'శతమానం భవతి', 'భరత్‌ అనే నేను','అరవింద సమేతస లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్‌ ప్రారంభంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్టుగా అలరిస్తున్న ఈమె వ‌య‌సు కూడా 47 ఏళ్లకు పైనే.

కౌసల్య..
'అల్లుడు గారు వచ్చారు', 'పంచదార చిలక' వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన కౌసల్య ఇప్పుడు సహాయ పాత్రల్లో అల‌రిస్తోంది. 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'సవ్యసాచి','రంగ్‌దే' సినిమాల్లో ఆమె న‌ట‌న  సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. నాలుగు పదుల వయసు దాటినా మూడుముళ్ల బంధానికి మాత్రం దూరంగానే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: