సిగ్నేచర్ స్ట్రెంత్ : కొన్ని సినిమాలే..కృష్ణవంశీవి

 ఈ ప్రపంచంలో ఒక వింత కానీ అద్భుతం కానీ ఉండి ఉంటాయి..వింత అయితే ఆర్జీవీ..అద్భుతం అయితే ఇళయరాజా..ఈ ప్రపంచంలో చుట్టూ ఉన్నవారిలో స్నేహం అయినా ద్వేషం అయినా కూడి ఉండాలి..స్నేహం సీతారామశాస్త్రి..ద్వేషం ఇంకా ఆ జాబితా నాకు తెలియదు..ఆయన విషయమై..ఈ ప్రపంచంలో సినిమా పాటకు మరికొంత అర్థం అయినా ఉండాలి లేదా నిర్వచనం అయినా రాయాలి..అర్థం ఎప్పుడో చెప్పాడు..నిర్వచనం కోసం వెతుకులాటలో ఉన్నాడు..ఈ ప్రపంచం మనకు ఇచ్చిన కానుకల పరంపరను వద్దనుకుంటే..ఆ గోదావరి తీరం ఓ ఓదార్పు అవుతుంది. ఈ ప్రపంచం ఈ జన్మకు సాఫల్యత వెతుక్కొమంటే తప్పకుండా ఆ పని చేసేందుకు మరో దారి వెతకాలి..ఆ దారి కూడా సినిమాలోనే ఉంది. సినిమాతోనే ఉంది. మీరు రమ్యా (పూర్తి పేరు రమ్య కృష్ణ) డబ్బులు వృథా చేశారా అని అడిగారు ఓ సారి కృష్ణవంశీని ఓ విలేకరి.. తప్పండి అలా అనుకోవడం తప్పు.. ఆ సినిమా విషయంలో నేను అనుకున్నది చేయాలేకపోయానన్న బాధ నాకుంటుంది అంతే కానీ రమ్యా డబ్బులతో నేనెందుకు ప్రయోగాలు చేస్తాను. ఓ వేళ పోయినా పట్టించుకునే మనసు ఆమెది కాదు నాది కూడా కాదు..అని కూడా అంటారు కృష్ణ వంశీ..సినిమా అనే లోకం నుంచి సినిమాకు విరుద్ధం అయిన లోకం వరకూ బతకడం తెల్సుకోవడం ఓ కర్తవ్యం.. ఆ పని ఎప్పుడో చేశాడు.. రైటింగ్ ప్యాడ్ విసిరి కొట్టాక పుట్టిన సన్నివేశాలే జీవితాన్ని మార్చాయి.. రామూ  సర్ మాకు ఇవన్నీ నేర్పారు.. ఎలా బతకాలో ఎలా ఉండకూడదో ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాం.అసలు సినిమాను పూర్తి చేయడం కన్నా సినిమా తీయడంలో ఉన్న కళనే ప్రేమించడం నేర్పాడు ఆర్జీవీ..

 

ఇవాళ కృష్ణవంశీ పుట్టిన్రోజు.. కొన్ని పాటలు ఆయన పుట్టిన్రోజున గుర్తుకువస్తాయి..కొన్ని సినిమాలు ఆయనేంటో చెప్పకనే చెబుతాయి..డబ్బులున్నాయన్న గర్వం డబ్బులు పోయాయి అన్న బాధ.. రెండూ లేకుండా  జీవించడంలో అర్థం ఉంది.. ఇంకా చెప్పాలంటే అదే గొప్ప కళ.. ఆయన సినిమాకు పాట రాయడం అనే వరం ఎందరో అందుకున్నారు. వరం కాదు శాపం అని తిట్టుకున్నారు కూడా.. అయినా మంచి పాట వచ్చిన ప్రతిసారీ ఎంత ఆనందించానో! ఇప్పుడెందుకు  ఇలా రావడం లేదు రాయడం లేదు అన్న కోపం ఇతరుల సినిమాలు చూస్తే వస్తాయి.. రావాలి కూడా.. ఇవాళ మళ్లీ మన అజ్ఞానాన్ని ఆజ్ఞా పూర్వకంగా ప్రశ్నించుకుంటే కృష్ణవంశీ కనపడ్తాడు..ఒక పాట అనే పిచ్చి లో తూగి సినిమా తీసి ఆనందం పోగొట్టుకుని ఒంటరి అయిపోయిన కృష్ణ వంశీ కనపడ్తాడు.. పేరు పోగొట్టుకున్న కృష్ణ వంశీ అంటే నాకెంతో ఇష్టం.. ఎందుకంటే వాటిని పట్టించుకోడు కనుక .. ఏ సక్సెస్ లేకుండా బతికిన కృష్ణవంశీ అంటే ఇంకా ఇష్టం.. మనం సినిమాలను గ్లోరిఫై చేయడం మానుకుంటే ఏదో ఒకటి తనకు చేతనైంది చేస్తాడు.. పాపం ఆయనను ఆయనలా పని చేయనివ్వని నిర్మాతలు కొందరున్నాక ఆయనేం చేస్తాడు. ఎనీవే రంగ మార్తాండ అనే సినిమా తో మళ్లీ కొత్త కృష్ణ వంశీ మనల్ని పలకరించాలన్నది నా కోరిక.. లవ్ యూ సర్ .. హ్యాపీ బర్త్ డే టీపీ గూడెం పిల్లోడా...


మరింత సమాచారం తెలుసుకోండి: