గ‌త కొంత‌కాలంగా క‌రోనా ప్ర‌భావంతో అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. ఇదే క్ర‌మంలో సినిమా రంగం కూడా చాలా న‌ష్ట‌పోయింది. దీంతో సినిమా థియేట‌ర్ల‌కు తాళాలు ప‌డ్డాయి. ఇప్పుడిప్పుడే క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతున్న నేప‌థ్యంలో తెలంగాన ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్ల ఓపెన్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.  అయితే ఈ శుక్రవారం నుంచే రీఓపెన్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది లాక్ డౌన్ తో పోల్చి చూస్తే... రెండో వేవ్ ముగిసిన త‌రువాత సినిమా థియేటర్లను కొద్దిగా ఆలస్యంగా తెరుస్తున్నారనే చెప్పాలి.


 మొదటి లాక్ డౌన్ సుదీర్ఘంగా కొన‌సాగినప్పటికీ.. అన్ లాక్  ప్రారంభ‌మ‌యిన  కొన్ని రోజులకే సినిమా థియేట‌ర్ల రీఓపెన్‌పై ప్రభుత్వం ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్రకటన వెలువ‌డినంత లోనే థియేటర్లు ఓపెన్ చేశారు. కానీ దీనికి భిన్నంగా.. రెండ‌వ వేవ్ ముగిసిన త‌రువాత కూడా థియేటర్లు తెరుచుకోవచ్చని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు రీ ఓపెన్ కాక‌పోయిన విష‌యం తెలిసిందే.


 తెలంగాణలో థియేటర్లు తెరుచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించినా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో థియేటర్లు మూసి ఉండటంతో సినిమాలు విడుదల చేయటానికి నిర్మాతలు సాహసించలేక‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. ఓటీటీ కూడా ఒక కార‌ణంగా మారింది. సినిమా థియేట‌ర్లు ఓపెన్ కాక‌పోవ‌డం ఓటీటీలో కూడా సినిమాల‌ను విడుద‌ల చేసే అవ‌కాశం ఉండ‌డంతో థియేటర్ల విషయంలో మాత్రం కాస్త ఆలస్యంగానే విడుదల చేసేందుకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు.



 చాలా రోజుల త‌రువాత‌ ఈ శుక్రవారం పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ అందులో రెండు సినిమాల మీదనే ఆస‌క్తి ఉంద‌ని తెలుస్తోంది. అందులో ఒకటి స‌త్య‌దేవ్‌ నటించిన తిమ్మరసు కాగా.. రెండోది తేజా సజ్జా నటించిన ఇష్క్ మూవీలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు  30 వ తేదినా థియేటర్లలో సందడి చేయనున్నాయి. తేజా సజ్జ, ప్రియా వారియర్ న‌టించిన ఇష్క్ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా ఏర్పాటు చేశారు.


ఈ  మీడియా స‌మావేశానికి  స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆయ‌న థియేట‌ర్ల‌లో సినిమా చూసే ప్రేక్ష‌కుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. థియేటర్లలో ప్రెక్ష‌కులు మాస్కు వేసుకుని మాత్రమే చూడాలని కోరారు. ఈ విధంగా చెప్పిన దిల్‌రాజు ప్రెస్ మీట్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చే సమయంలో పక్కనా చాలా మంది ఉన్నా దిల్ రాజు మాత్రం మాస్క్ పెట్టుకోకుండానే ఉన్నారు. ప్రెస్ మీట్ జ‌రిగేట‌ప్పుడు కూడా మాస్క్ ధ‌రించింది లేదు. అయితే ముందుగా ఆయ‌న క‌రోనా నిబంధ‌న‌లుఏ పాటించి ఇత‌రుల‌కు చెప్పాల‌నే అభిప్రాయం కూడా ప‌లువురి నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: