మళయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆలోచన రావడమే ఆలస్యం పవన్ తో మాట్లాడి ప్రాజెక్ట్ సెట్ చేయించాడు త్రివిక్రం. పవన్ సరే మరి ఈ సినిమాలో ఇంకో హీరో ఎవరు చేస్తారు అన్న డౌట్ తోనే రానాని అడిగితే అతను ఓకే చెప్పాడు. మళయాళ వర్షన్ లో పృధ్వి రాజ్ పాత్రను రానా చేస్తుంటే.. బిజూ మీనన్ రోల్ పవన్ చేస్తున్నారు. అయితే మాత్రుక సినిమాలో పృధ్వి రాజ్ పాత్రే బిజూమీనన్ పాత్రకి డామినేట్ చేసినట్టు ఉంటుంది. కాని తెలుగులో మాత్రం సీన్ రివర్స్ చేస్తున్నట్టు టాక్.

అక్కడ ఉంది పవర్ స్టార్ కాబట్టి పవన్ ను డామినేట్ చేస్తే బాగోదని రానా పాత్ర కాస్త తగ్గిస్తున్నారట. అంతేకాదు మళయాళ వర్షన్ లో ఇద్దరు పాత్రలు నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి కాని తెలుగు వర్షన్ లో హీరో పవన్ కళ్యాణ్, రానా విలన్ అన్నట్టుగా స్క్రీన్ ప్లే రాస్తున్నారట. అయితే పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసమే రానాసినిమా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. బాహుబలి లాంటి సినిమాలోనే విలన్ గా చేసిన రానా పవన్ కోసం విలన్ గా నటించలేడా అందుకే పవన్ సినిమాలో తన పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉన్నా సరే ఓకే చెప్పాడు.

ఇక సోలో హీరోగా రానా తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నాడు. వేణు ఊడిగుల డైరక్షన్ లో విరాటపర్వం సినిమా చేసిన రానాసినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఓటీటీ రిలీజ్ అని వార్తలు వచ్చినా మేకర్స్ మాత్రం విరాటపర్వం లేట్ అయినా సరే థియేట్రికల్ రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రానా సరసన సాయి పల్లవి ఈ సినిమాలో జోడీ కట్టింది. విరాటపర్వం ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండగా అయ్యప్పనుం కోషియం సినిమా రీమేక్ మాత్రం 2022 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: