మకుటంలేని మహారాణిగా బుల్లితెర పై స్టార్ యాంకర్ గా దూసుకుపోతుంది సుమ. బుల్లితెర పైన టీవీ షో లలో మాత్రమే కాకుండా ఆడియో ఫంక్షన్ లో కూడా యాంకరింగ్ చేస్తూ తన స్టైల్లో దూసుకుపోతుంది. ఏ స్టార్ హీరో సినిమా ఫంక్షన్ అయినా సుమ తప్పకుండా ఉండాల్సిందే.సుమ లేనిదే తమ సినిమా విడుదల కాదు అన్న విధంగా గా అలోచిస్తున్నారు సదరు నిర్మాతలు.  దాంతో తెలుగులోని పెద్ద సినిమాలకు సుమ మాత్రం యాంకరింగ్ చేయడం మనం చూస్తున్నాం. స్పాంటేనియస్ పంచులు వేసి ప్రేక్షకులను నవ్వించడంలో సుమని మించిన యాంకర్ లేదు.

తాజాగా సినీయర్ నటి రాజ్యలక్ష్మి సుమకి షాక్ ఇచ్చింది. ఈ వయసులో కూడా మేము వయసులో ఉన్నప్పుడు వేసుకున్న బట్టలు వేసుకుంటున్నావా అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ప్రతివారం సెలబ్రేటీలతో క్యాష్ షో ఎంతో ఎంటర్టైనింగ్ గా జరుపుతుంది సుమ. అలా ఈ వారం కూడా సీనియర్ నటుడు గౌతమ్ రాజు, బాబు మోహన్, శివకుమారి క్యాష్ షో కి  రావడం జరిగింది. వీరితో పాటు సీనియర్ మరి రాజ్యలక్ష్మి  కూడా వచ్చారు. సీనియర్ నటులతో కొనసాగిన ఈ ఎపిసోడ్ మొత్తం ఎంతో ఎంటర్టైన్ మెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగా సీనియర్స్ అయినా కూడా సుమ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. 

అయితే సుమ బాబు మోహన్ ను మీరు మొదటిసారి క్యాష్ కి వచ్చారా అని అడిగింది. దానికి మోహన్ బాబు లేదు గతంలో ఒకసారి వచ్చిన జ్ఞాపకం ఉందని అన్నాడు. ఆ మాటలకు శివకుమారి అందుకుని ఈ ప్రోగ్రాంలో వచ్చిన డబ్బుతోనే మీరు ఇల్లు కొనుకున్నారు కదా అని పంచ్ వేసింది. అయితే వీరిని పరిచయం చేసేటప్పుడు సుమ కు రాజ్యలక్ష్మి షాక్ ఇచ్చింది. సుమ రాజ్యలక్ష్మి ఎంట్రీ కాగానే మీరు నాకు పోటీ అని గట్టిగా రెడీ అయి వచ్చారు అని లక్ష్మి ని ఉద్దేశించి అన్నారు. దానికి లక్ష్మి నిన్ను చూస్తే నాకు అసూయ కలుగుతుంది. దానికి కారణం ఎప్పుడో మేము చిన్నప్పుడు వేసుకునే డ్రెస్ ను ఈ వయసులో కూడా వేసుకుంటున్నావు అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: