దర్శక ధీరుడు రాజమౌళి మరియు సంగీత దర్శకుడు కీరవాణి ల మధ్య ఉన్న బంధం అన్నదమ్ముల అనుబంధం మాత్రమే కాదు గొప్ప సాంకేతిక నిపుణుల మధ్య ఉన్న బంధం కూడా. రాజమౌళి తన తొలి సినిమా నుంచి కీరవాణి తప్ప మరే సంగీత దర్శకుడితో పని చేయలేదు అందుకు కారణం తన ఆలోచనలకు దగ్గరగా సినిమాకు తగ్గ సంగీతాన్ని కీరవాణి అందిస్తుండడం. ఇప్పటివరకు రాజమౌళి సంగీత దర్శకుడుని మార్చకుండా కీరవాణి తో మాత్రమే సినిమా చేయడం అంటే వారిద్దరి మధ్య ఎంతటి అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ  జక్కన్న కెరీర్లోనే తొలిసారిగా కీరవాణి తో పాటు మరో సంగీత దర్శకుడి పేరు ఆర్ ఆర్ ఆర్ సినిమాపై రాబోతోంది.  చాలా మంది సినిమా దర్శకులకు సంగీత దర్శకులను మార్చే అలవాటు ఉండదు. ఒకరితో మాత్రమే వరుస సినిమాలు చేస్తూ ఉంటారు. వాళ్లతోనే కంటిన్యూ అవుతూ ఉంటారు. వాళ్లతో ఉండే కంఫర్ట్ జోన్ అలాంటిది. వారి కాంబోలో వచ్చే పాటలు కూడా హిట్ అవుతాయి. బాగా ఉంటాయి. అలాంటిదే వీరిద్దరి కాంబినేషన్. సినిమా అటు ఇటు అయినా కూడా పాటలకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చేది వీరి సినిమాలకు. 

అలాంటిది తొలిసారి కీరవాణిని కాదని కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ తో పని చేస్తున్నాడు రాజమౌళి. తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమా పాన్ ఇండియా కథ కావడంతో అన్ని భాషలలో కనెక్ట్ అయ్యే సంగీతం కోసం తమిళం వరకు అనిరుధ్ రవిచందర్ తో ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నారు రాజమౌళి. దీనికి సంబంధించిన ఓ సెషన్ కూడా పూర్తయ్యిందట. దీనికి సంబంధించి ట్వీట్ కూడా చేశాడు కీరవాణి. అనిరుధ్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది ఆయన టాలెంట్ ఉన్న పర్సన్ అంటూ ప్రశంసించాడు. అంతే కాదు డౌన్ టు ఎర్త్ అంటూ మునగ చెట్టు ఎక్కించేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: