టాలీవుడ్ సినీ పరిశ్రమలో నిర్మాత సురేష్ బాబు చేసే సినిమాలకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన అభిరుచికి తగ్గట్లు చిన్న సినిమాలను, పెద్ద సినిమాలను తెరకెక్కించి అద్భుతంగా వాటిని నిర్మిస్తూ సూపర్ హిట్ లు సాధిస్తున్నాడు. మూవీ మొఘల్ రామానాయుడు ఆశయాలకు అభిరుచులకు తగ్గట్లుగా ఆయన తనయుడు గా సినిమాల్లోకి అడుగుపెట్టి నిర్మాణంలో తండ్రిని మించిన తనయుడు గా ఎదుగుతున్నాడు. డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా సురేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర నిర్మాత గా కొనసాగుతున్నాడు. సినీ స్టూడియో నిర్వహణతో పాటు థియరిటికల్ బిజినెస్ లో కూడా గొప్పగా ఆయన రాణిస్తున్నారు.

డిజిటల్ రంగ ప్రవేశం తర్వాత కూడా అడ్వాన్స్ స్టేజి లో ఆలోచిస్తూ సినిమా ముందు ముందు ఎలా ఉంటుందో సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందుగానే విశ్లేషించి ఆ రకంగా అడుగులు వేస్తూ సినిమాలు నిర్మిస్తూ వెళుతున్నాడు. ప్రతిభ ను ప్రోత్సహించడంలో రామానాయుడు తరహాలోనే సురేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. వివాదాల  జోలికి ఎప్పుడూ వెళ్ళరు. తన పని తను చేసుకు పోవడం తప్ప ఇతర విషయాలలో వేలు పెట్టడం అనేది తెలియదు ఆయనకు. సమస్య తన వద్దకు వచ్చిన సానుకూలంగా పరిష్కరించుకునే వ్యక్తిత్వం కలవారు ఆయన.

సినిమా పరిశ్రమలో ఎంతోమంది తనను మోసం చేసినట్లు ఆయన దగ్గర నుంచి అప్పులు రూపంలో ఇతర మార్గాల ద్వారా చాలా డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. కానీ ఎవరూ తిరిగి ఇవ్వలేదట.  డబ్బున్న వారు సైతం ఆయన మోసం చేసిన వారిలో ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు బయటకు వస్తాయని పేర్కొన్నారు. సినిమాలు నిర్మిస్తానని పంపిణీ కోసం అనీ సినిమా ఫైనాన్స్ కోసం అనీ కొంతమంది ఆయన  వద్ద డబ్బులు తీసుకుని ఇప్పటివరకు చాలా మంది తిరిగి ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు లేకపోతే ఏదో అనుకోవచ్చు ఉండి కూడా తిరిగి ఇవ్వని వాళ్ళ పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.  సినిమా తీసి నష్టం వచ్చి అప్పుల్లో కూరుకు పోయిన వాడు ఇవ్వలేదు అంటే అందులో అర్థం కనిపిస్తుంది కాని హిట్ కొట్టిన వాళ్లు గల్లాలు నిండిన వాళ్ళు కూడా ఇలా చేస్తే భవిష్యత్తులో ఎవరికీ ఏ సహాయం చేయాలనిపించదు అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: