కన్నడ చిత్ర సీమలో పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన ఏకైక నటుడు రాజకుమార్ అని చెప్పవచ్చు. ఈయన నటన అసాధారణం. సినీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్ లను సొంతం చేసుకొని, కన్నడ సూపర్ స్టార్ గా సినీ చిత్రసీమను ఏకచ్ఛత్రాధిపతిగా ఏలుతున్నాడు. ఇక కేవలం ఆయన మాత్రమే కాదు..ఈయన నుంచి వారసత్వం పుచ్చుకుని ఆయన కుమారులు కూడా సినీ ఇండస్ట్రీలో , తమకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో పునీత్ రాజ్ కుమార్  అలాగే శివ రాజ్ కుమార్ ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.
ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, మన తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాగో  అక్కడ కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్  కూడా అలాగ. ఇక అత్యధిక బడ్జెట్ సినిమాలు తీయడం విశేషం. ఇక దక్షిణాది సినిమాలన్నింటిలో నటిస్తూనే ఇక బాలీవుడ్ లో కూడా నటించడానికి సిద్ధమవుతున్నాడు.
అయితే ఇంతటి స్టార్ ఫ్యామిలీ నుంచి మరొక నట వారసురాలు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఆమె ఎవరో కాదు పవర్ స్టార్ రాజ్ కుమార్ మనవరాలు ధన్య రామ్ కుమార్. వారి తాత లాగే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ,ఆమె కూడా తన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఆమె కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

త్వరలోనే ఆమె నటించిన సినిమా లాంచింగ్ కూడా కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా పేరు ఏంటి..?ఈ సినిమా దర్శకుడు ఎవరు..? నిర్మాత ఎవరు..? హీరో ఎవరు..? అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు రహస్యంగా ఉంచడం గమనార్హం.. అయితే త్వరలోనే ఈమె సినిమా విడుదల అయి సక్సెస్ ని అందుకుంటుందో.. లేదో.. వేచి చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: