సినీ ఇండస్ట్రీలో దర్శకులు చాలామంది ఉంటారు. సినిమా తీసిన ప్రతి ఒక్కరు హిట్ సాధిస్తారని చెప్పలేము. ఒకవేళ ఎన్నో సినిమాలు హిట్ సాధించిన కూడా 2,3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటే ఇక అందరూ ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలంటే భయపడుతూ ఉంటారు. అయితే తమిళ్ ఇండస్ట్రీ దర్శకుడు ప్రతిరోజు 150 సిగరెట్లు తాగేవారట. అయితే ఆయన ఎందుకు మానేశారో ఒకసారి తెలుసుకుందాం.


తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఈయన టాప్ డైరెక్టర్లలో ఒకడు. ఈయన సినిమాలు కొత్తదనంతో ఉంటాయి. అందుచేతనే తమిళ సూపర్ స్టార్స్ ఆయనతో నటించడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రముఖ ఛానల్ ద్వారా తెలిపాడు.

డైరెక్టర్ వెట్రిమారన్ తన చిన్న వయసులోనే.. సిగరెట్లు తాగడం అలవాటు చేసుకున్నాడు. షూటింగ్లో, స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నా సరే రోజుకి దాదాపుగా 150 నుంచి 160 సిగరెట్లు తాగేవారట. అంతలా అలవాటుపడిపోయారు సిగరెట్లకు ఈయన. కానీ ఈయన ప్రస్తుతం సిగరెట్లు మానడానికి ఒక సినిమానే కారణమని చెప్పుకొచ్చాడు.

సూర్య హీరోగా నటించిన చిత్రం "సూర్య సన్నాఫ్ కృష్ణన్". ఈ సినిమా చూసిన వెట్రిమారన్ సిగరెట్లు మానేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా లో చెప్పిన సందేశం వల్ల మారానని, ఆయన పలు టీవీ ఛానల్ లో ఈ విషయాన్ని తెలిపారు. ఇక అంతే కాకుండా ఈ సినిమా నాలాంటి వారిని ఎందరినో మార్చి ఉంటుంది అని అనుకున్నాను అంటూ తెలిపాడు.

ఇక ఈయన ఆ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చిన తరువాత.. మీరు చెప్పింది కరెక్టే సార్ అని ఒక నెటిజన్ కామెంట్ రూపంలో తెలిపారు. మీలాగా సెటిల్ అయిన వాళ్ళు ఎంతోమందిని ఈ సినిమా మార్చి ఉంటుందని తెలిపారు. ఏది ఏమైనా ఒక సినిమా ని చూసి మంచిగా ఇన్స్పైర్ అవ్వడం అంటే అది అతిశయోక్తి కాదు. చాలా మంది.. సినిమాలు మనుషులను చెడగొడతాయి అంటారు..కానీ మనం చూసే దృష్టి వల్లే మనం చెడిపోతున్నాము అని గుర్తుంచుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: