తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ గా మంచి ఛాన్స్ లతో కొనసాగుతున్న భామల్లో నభ నటేష్ కూడా ఒకరు అనే చెప్పాలి. తొలిసారిగా సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది నభ. అయితే ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో నభ కు హీరోయిన్ గా బాగా పేరు వచ్చింది. నిజానికి ఆమె తొలిసారిగా వెండితెరమీద మెరిసింది మాత్రం కన్నడలో శివ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన వజ్రకాయ మూవీతో.

ఇక తెలుగులో నన్ను దోచుకుందువటే అనంతరం రామ్ హీరోగా పూరి తీసిన మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ తో మరొక హిట్ తన ఖాతాలో వేసుకుంది నభ నటేష్. అనంతరం మాస్ రాజా రవితేజ తో డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్, అలానే ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించింది. అయితే అవి పెద్దగా సక్సెస్ కానప్పటికీ నటిగా మాత్రం తన అందం, అభినయంతో ఆడియన్స్ ని అలరించింది నభ. ఇక ప్రస్తుతం ఆమె నితిన్ తో మ్యాస్ట్రో మూవీ చేస్తోంది.

ఇటీవల హిందీ లో సూపర్ హిట్ కొట్టిన అంధధూన్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా టచ్ లో ఉండే నభ నేడు గ్రీన్ కలర్ ట్రెండీ స్టైల్ డ్రెస్ లో దిగిన తన  లేటెస్ట్ ఫోటో షూట్ ఫోటోలు పోస్ట్ చేసింది. కాగా అవి ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో తన అందంతో యువతకి పిచ్చెక్కిస్తున్న నభ రాబోయే రోజుల్లో తన సినిమాలతో ఎటువంటి స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి .... !!


మరింత సమాచారం తెలుసుకోండి: