బండ్ల గణేష్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈయన ఎంత స్పెషలో తెలిసిందే.బండ్ల గణేష్ పవన్ పై అభిమానాన్ని ప్రతి విషయంలో తెలియజేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ డైరెక్షన్ లో గబ్బర్ సింగ్, తీన్ మార్ వంటి సినిమాలు వచ్చాయి.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో మరో సినిమాని తీయాలని ఆలోచనలో ఉన్నాడు బండ్ల. ఇంకా ఆ సినిమా ఎప్పుడు నిర్మిస్తాడనే  విషయం తెలియాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ మలయాళ అయ్యప్పనున్ కోషియం రీమేక్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ రీమేక్ లో పవన్ బిమ్లా నాయక్ అనే పాత్రలో నటిసస్తుండగా ఆ సినిమాలోని ఓ పోస్టర్ ని తాజాగా చిత్రయూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

పోస్టర్ లో పోలీస్ గెటప్ లో పవన్ లుక్ అదిరిపోయింది.ప్రస్తుతం నెట్టింట్లో ఈ లుక్ ఎంతో వైరల్ గా మారింది.ఇక ఈ లుక్ పై బండ్ల గణేష్ దేవర వేట మొదలైంది అని పవన్ గురించి మరోసారి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ నిలుచున్న విధానానికి బండ్ల గణేష్ చేతులు ఎత్తి మొక్కారు. దాదాపు మూడున్నర నెలల తరువాత నిన్న షూటింగ్ లో పాల్గొన్నారు పవర్ స్టార్.ఇక ఈ సినిమాలో పవన్ పాత్ర పేరు లీక్ అయినందున ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

ఇక ఈ సినిమా అప్డేట్ రావడంతో  పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్ కి,బండ్ల గణేష్ ట్వీట్ కి రికార్డు స్థాయిలో లైక్స్  కామెట్లు వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిల సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది.ఇక ఈ సినిమాతో పాటూ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ని కూడా పూర్తి చేయాలని భావిస్తున్నాడు పవన్. ఇప్పటికే ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. భారీ పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏ. ఎమ్. రత్నం నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: