ప్రముఖ సీనియర్ నిర్మాత, ఏషియన్ ఫిలిమ్స్, ఎస్వీసీసీ ప్రొడక్షన్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ చేతిలో టాలీవుడ్ మొత్తం ఉంది. అదేంటంటే... ఆయన ఇప్పుడు టాలీవుడ్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు అన్నింటిలోనూ ఆయన నిర్మాణ భాగస్వామ్యం ఉంది. ఏకంగా 10 భారీ బడ్జెట్ చిత్రాలను నారంగ్ నిర్మిస్తుండడం విశేషం. అందులో కొన్ని సినిమాలకు సొంతంగానే నిర్మాణ సారథ్యం వహిస్తున్న నారంగ్, మరికొన్ని చిత్రాలకు మాత్రం ఇతర భాగస్వాములతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ జాబితాలో ముందుగా మాట్లాడుకోవాల్సింది మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ "లవ్ స్టోరీ" గురించి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రంలోని సాంగ్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ కరోనా దానికి బ్రేక్ వేసింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది.

ఇక ఆ తరువాత టాలీవుడ్ కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ను థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. శరత్ మరార్ తో కలిసి "లక్ష్య"ను కూడా రూపొందిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో నాగశౌర్య ఆర్చర్ గా కనిపించబోతున్నాడు. మరోవైపు యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా కమెడియన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించనున్న ప్రాజెక్ట్ కూడా ఈయన చేతుల్లోనే ఉంది. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. అంతేకాదు పాన్ చిత్రాలపైనా నారంగ్ దృష్టి పెట్టారు. కోలీవుడ్ స్టార్ ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానున్న మల్టీలింగ్వల్ మూవీ, అలాగే అడవిశేష్ "మేజర్", శర్వానంద్ తో ఒక మూవీ, శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ మూవీలతో పాటు పలు చిత్రాలను నిర్మాతగా టాలీవుడ్ కు అందించబోతున్నారు. ఆయన నిర్మాత మాత్రమే కాదు నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ కూడా. ఏఎంబి మల్టిప్లెక్స్ నిర్వహణతో పాటు తెలంగాణలోని చాలా థియేటర్లు ఆయన చేతిలోనే ఉన్నాయి. మరోవైపు ఆయన తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు కూడా. ఇప్పుడు చెప్పండి టాలీవుడ్ ఆయన చేతిలో ఉన్నట్టా లేనట్టా ?

మరింత సమాచారం తెలుసుకోండి: