సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి పేరు పెట్టడం అనేది అంత సులభంగా అయ్యే పని కాదు. అందులో ఇంకా కష్టం ఏంటంటే స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ సెలెక్ట్ చేయడం.అలా టైటిల్స్ విషయంలో కష్టాలు పడకుండా మన ఈతరం దర్శకులు  చిన్న కోడ్ నేమ్స్, వర్కింగ్ టైటిల్స్ తో సినిమాలు మొదలు పెట్టేస్తున్నారు.అందులో మనకు బాగా తెలిసిన సినిమా పేరు RRR.అంటే రామారావు,రాజమౌళి, రాంచరణ్ అని అందరికి తెలిసిందే.ఇలా ఆర్ ఆర్ ఆర్ అని వర్కింగ్ టైటిల్ గా తీసిన ఆ తరువాత అదే సినిమా టైటిల్ నేమ్ గా మారింది.ఇక ఇప్పుడు మరో యువ దర్శకుడు కూడా టైటిల్ విషయంలో మన రాజమౌళిని ఫాలో అవుతున్నాడు. అతనే నాగ్ అశ్విన్.

ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో చేస్తున్న సినిమాలో  నాగ్ అశ్విన్ అనే పదం కూడా రాబోతుందని తెలుస్తోంది.ఇక తాజాగా ఈ సినిమాని అధికారికంగా ప్రారంభించి.. ట్రయల్ షూట్ కూడా చేసారు.ఈ నేపథ్యంలో  సినిమాకి 'ప్రాజెక్ట్ కె' అని పేరు పెట్టారు.షూటింగ్ మొదలు అంటూ క్లాప్ బోర్డు ఫోటో ని కూడా చూపించారు.  ఇది ఇలా ఉండాగా ప్రాజెక్టు కె అనే పేరుకు ముందే సినిమా పేరు పెట్టారట కాకపోతే అది ఇంకా రివిల్ చేయలేదు.విడుదల చేసిన క్లాప్ బోర్డు ఫోటో ని చూస్తే 'ప్రాజెక్టు కె' అనే పేరుతో పాటు కింద చిన్న చిన్న  చిన్న అక్షరాలు ఏవో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది.

అసలు క్లాప్ బోర్డు ఫోటో బయటికి రిలీజ్ చేయడానికి కారణం  ప్రాజెక్టు కె అనే టైటిల్ తో పాటు ఏదో స్టిక్కర్ అతికించిబడటం అని టాలీవుడ్ లో ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయి.సినిమా పేరు కె తో మొదలవుతుందని అందుకని ఇలా కె అనే లెటర్ తో హైప్ క్రియేట్ చేయడమే ఉద్దేశం అట. ఈ నేపథ్యంలో సినిమా పేరు 'కె' అనే అక్షరంతోనే ఉండబోతోందని సమాచారం.ఇక వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: