మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను తలపిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ సారి అధ్యక్ష పదవి కోసం ఎక్కువ మంది పోటీపడుతున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ , సీవీఎల్ నరసింహా‌రావు‌తో పాటు ఓ.కల్యాణ్ కూడా మా ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. ఇక బరిలో సత్తా చాటేందుకు గాను ఆల్రెడీ ప్రకాశ్‌రాజ్ తన కార్యవర్గంతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సంగతి విదితమే. కాగా, అక్కడ స్థానికత అనే అంశం చర్చనీయాంశమైంది. తాను తెలంగాణ‌లో ఓ జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకుని చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే తనకు ఈసారి మా అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కోరాడు. ఇక ఈ ప్రెస్‌మీట్‌లో ఫైర్ బ్రాండ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. జీవిత రాజశేఖర్‌తో పాటు నరసింహారావు తమ ప్యానెల్ సభ్యులను పరిచయం చేసుకున్నారు. అయితే, ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదు. కానీ, ఎలక్షన్స్‌లో లోకల్, నాన్ లోకల్‌తో పాటు తెలంగాణా వాదం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే మా ఎన్నికల వ్యవహారం త్వరలో ఓ కొలిక్కిరానున్నట్లు సమాచారం. మా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
అవేంటంటే..


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు జీవిత బీమాకు చెల్లించాల్సిన ప్రీమియంతో పాటు జీవిత సభ్యత్వాలను ఇవ్వడం గురించి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో ఈసీ సభ్యులతో పాటు క్రమశిక్షణా సంఘ చైర్మన్‌ కృష్ణంరాజు, న్యాయసలహాదారు, ఆడిటర్‌ పాల్గొనున్నారు. అయితే, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఎన్నికల్లో కాకుండా క్రమశిక్షణా సంఘం చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ‘మా’మీటింగ్‌ను వర్చువల్‌గా నిర్వహించనున్నారు. ‘మా’ సంస్థ ఏర్పడిన తర్వాత వర్చువల్ మీటింగ్ నిర్వహించడం ఇదే తొలిసారి. కాగా, ఒకవేళ కొవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ లేకపోతే సెప్టెంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశముంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ విషయమై ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ డెసిషనే ఫైనల్‌గా ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: