నాచురల్ స్టార్ నాని మరో క్రేజీ సినిమాను సన్నద్ధం అవుతున్నాడు. నాని నటించిన టక్ జగదీష్ శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తుంది. త్వరలో రిలీజ్ అవబోతున్న ఈ సినిమాతో పాటుగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమా కూడా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తర్వాత నాని వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తాడని తెలుస్తుంది.

శ్యాం సింగ రాయ్ షూటింగ్ పూర్తవడంతో నాని ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అంటే సుందరానికీ షూటింగ్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా నాని నూతన దర్శకుడు శ్రీకాంత్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారని అంటున్నారు. సినిమాలో నాని తెలంగాణా కుర్రాడిగా కనిపిస్తాడని తెలుస్తుంది. అందుకే సినిమా కోసం నాని తెలంగాణ యాస నేర్చుకుంటున్నాడని తెలుస్తుంది.

నాగ చైతన్య లవ్ స్టోరీ సినిమాలో కూడా తెలంగాణా కుర్రాడిగా కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు నాని కూడా తెలంగాణా యాస కోసం ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణా యాస కోసం ప్రత్యేకంగా ట్యూటర్ ను పెట్టుకున్నట్టు టాక్. కృష్ణార్జున యుద్ధం సినిమాలో రాయలసీమ యాస మాట్లాడిన నానిసినిమా కోసం తెలంగాణా యాస నేర్చుకుంటున్నాడని తెలుస్తుంది. వరుస క్రేజీ సినిమాలతో నాని తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. నాని టక్ జగదీష్, శ్యాం సింగ్ రాయ్ రెండు సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంటే శ్రీకాంత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా కూడా వెరైటీగా ఉంటుందని అంటున్నారు. తన సినిమాల విషయంలో ఎప్పుడూ ఫోకస్ తో ఉండే నాని ఈసారి కొత్త కథతో తెలంగాణా యాస నేర్చుకుని మరి ప్రయత్నిస్తున్నాడు అంటే సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: