ప్రస్తుతం టాలీవుడ్ ఎప్పుడు లేని సంక్షోభం లో ఉంది. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోవటం తో సినిమా పరిశ్రమ దిన దిన గండం గా గడుస్తుంది. అందులోనూ  పెద్ద సినిమాలు ధియేటర్ లలో విడుదల కాకపోవడంతో ఒక్కసారిగా సినిమా పరిశ్రమ అతలాకుతలం అయిపోతుంది. ఈనెల 30న కొన్ని చిన్న సినిమాలు విడుదల అవుతున్న కూడా పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం ఎంతో భారీ నష్టాన్ని చేకూర్చేలా ఉంది. టికెట్ సమస్యలు, కరోనా నిబంధనలు ఇవన్నీ దాటుకొని సినిమా కు ప్రేక్షకుడు చేరుకోవాలి అంటే నిర్మాతలకు కత్తి మీద సాము తో కూడుకున్న పని.

భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు ఏ మాత్రం తొందరపడకుండా సినిమాను విడుదల చేయడానికి ముందడుగు వేయట్లేదు. ఒక కోటి రూపాయలు అటు ఇటు అయినా కూడా తట్టుకునే నిర్మాతలు కూడా ధైర్యం చేయటం లేదు. ఇంకా సేఫ్ జోన్ లోనే ఉంటూ ఓ టీ టీ పై దృష్టి పెడుతున్నారు. మునుపటిలా సినిమా పరిశ్రమ సినిమాలతో భారీ సినిమాలతో థియేటర్ లు కళకళలాడాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. అలా జరగాలంటే ఎవరో ఒకరు ధైర్యం చేయాలి. కానీ ఒక్క పెద్ద నిర్మాత కూడా ధైర్యం చేయడం లేదు. 

చదరంగంలో బంటు లు ముందుగా కదిలినట్లు, యుద్ధంలో సైనికులు ముందుగా రంగంలోకి దిగినట్లు రెండు చిన్న సినిమాలు ఈవారం బరిలోకి దిగుతున్నాయి వాటి సినిమాలు ధైర్యంగా రంగంలోకి దిగుతాయేమో. సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరసు సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే యువహీరో తేజ సజ్జ నటించిన ఇష్క్ సినిమా కూడా థియేటర్లలో ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు ఆడే పరిస్థితిని బట్టి ఆ తర్వాత పెద్ద సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. మరి ఈ రెండు సినిమాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: