బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తెలుగు సినిమాల్లో నటించాలని ఆయనను తెలుగు తెరపై చూడాలని ఎంతో మంది తెలుగు అభిమానులు కోరుకోవడం సహజమే కానీ ఆయనకు హిందీ లో ఉన్న కమిట్మెంట్ ల ప్రకారం ఇప్పటి వరకు కొన్ని సినిమాలలో మాత్రమే ఆయన తెలుగులో అతిధి పాత్రలలో మెరిసారు. గతంలో ఆయన హీరోగా చేస్తున్న సమయంలో చాలామంది తెలుగు దర్శక నిర్మాతలు ఆయనను తెలుగులో సినిమా చేయడానికి ఒప్పించడానికి ట్రై చేశారు కానీ బాలీవుడ్ లో ఆయన సినిమాల్లో ఎప్పుడూ బిజీ వా ఉండడంతో తెలుగులో సినిమా చేయడానికి కుదరలేదు.

అయినప్పటికీ కొన్ని ముఖ్య పాత్రలలో మాత్రం ఆయన కనిపించారు. తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇటీవలే కొన్ని సినిమాలలో అమితాబచ్చన్ కనిపించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మురిపించారు. మనం సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్ చేసి ఆయన మొదటిసారి నేరుగా ఓ తెలుగు సినిమాలో కనిపించగా ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా నటించి మరొకసారి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఖుషీ చేశారు.

అయితే గతంలో చాలా సార్లు మన తెలుగు దర్శక నిర్మాతలు అమితాబ్ ను తమ సినిమాలలో నటించాల్సింది గా కోరగా ఆయన తనకున్న కమిట్మెంట్స్ ప్రకారం ఆ సినిమాలో చేయలేకపోయాడట. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం పోకిరి లోని ఓ పాత్ర కోసం అమితాబ్ ను సంప్రదించగా డేట్స్ ఖాళీ లేక ఆ సినిమా చేయలేదు.  అలాగే బాహుబలి లో కూడా ఓ ప్రాముఖ్యత కలిగిన పాత్ర కోసం రాజమౌళి అమితాబ్ ను సంప్రదించారట. దానికి కూడా ఆయన ఒప్పుకోలేదు అని తెలుస్తోంది. ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ వచ్చిన అమితాబ్ ఇప్పుడు ప్రాజెక్టు కే సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: