తెలుగు సినిమాకు గ్లామర్ కావాలి. అలా ఇలా కాదు, చాలా ఎక్కువ కావాలి. దాంతో అందాల భామలు క్యూ కట్టి మరీ తెలుగు వైపు దూసుకువస్తున్నారు. అయితే ఎందరు వచ్చినా కొరత అలాగే ఉంటోంది. దాంతో ఆ నిత్య నూతన‌మైన సౌందర్యం అలా తెలుగు వెండితెర మీద ప్రకాశిస్తూనే ఉంటోంది.

ఈ లిస్ట్ లో  ప్రియాంక జవాల్కర్ కూడా ఉంది. ఈ అమ్మడు నిజానికి ఈ పాటికే టాలీవుడ్ ని ఏలాల్సిందే. కానీ ఒక్క హిట్ కోసం చూస్తోంది. అదే ఆమెకు అగ్ని పరీక్ష పెడుతోంది. ఆ హిట్ పడడమేంటి తాను స్టార్ హీరోయిన్ రేసులో రివ్వున తారాజువ్వలా దూసుకుపోతానని అంటున్నారు. ఈ అమ్మడుకు ఫస్ట్ మూవీ టాక్సీవాలా.  రౌడీ హీరో  విజయ్ దేవరకొండ పక్కన ఆమె నటించింది. ఈ మూవీ మీద ఎంతో అంచనాలు ఉన్నా కూడా ఎందుకో చతికిలపడింది.

దాంతో ఆమెకు  చాన్సులు లేకుండా పోయాయి. అయితే నిరాశపడలేదు. ఇపుడు సత్యదేవ్ హీరోగా తిమ్మరుసు మూవీ వస్తోంది. అందులో ఈ ముద్దు గుమ్మ హాట్ హాట్ అందాలను వెండితెర మీద  వడ్డించేందుకు రెడీ అయిపోయింది. ప్రియాంక జవాల్కర్ లో ఇంత అందం దాగి ఉందా అని అంతా షాక్ తినేలా అమ్మడి క్యూట్  లుక్స్ ఉన్నాయి. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు కానీ బయటకు వచ్చిన ప్రియాంక జవాల్కర్ ఇమేజెస్ కానీ చూస్తూంటే తిమ్మరుసు తెలివినే దెబ్బ తిసేలా ప్రియాంక జవాల్కర్ ఉందని అంటున్నారు. ఈ ఒక్క హిట్ చాలు తాను టాలీవుడ్ ని ఏలేస్తాను అంటోంది ధీమాగా. ఈ మూవీ మీద కూడా బాగానే అంచనాలు ఉన్నాయి. ఈ హిట్ పడితే కనుక టాలీవుడ్ లో ప్రియాంక జవాల్కర్ హవా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. చూడాలి మరి. అన్నట్లు ఈ అమ్మడు ఎస్.ఆర్ కళ్యాణమండపం అనే మూవీలో కూడా నటిస్తోంది. మరి ఈ బ్యూటీ ఇచ్చే పోటీని తట్టుకోలేరు అంటున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: