దర్శకధీరుడు రాజమౌళి దర్శకుడిగా విజయం సాధించడానికి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక విధంగా కారణమన్న విషయం తెలిసిందే. రాజమౌళి తాను ఎప్పుడు సొంతగా కథను తయారు చేసుకోలేదు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ఏదొక విధంగా తెలిసిన కథలాగానే ఉంటుంది. కథ తెలిసిన దానిని తెరకెక్కించే విధానం చాలా కొత్తగా ఉంటుంది.రాజమౌళి ప్రతి సినిమాకు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించి జక్కన్నకు వినిపిస్తాడట.విజయేంద్ర ప్రసాద్ కథలు తాను బాగా చదివిన నవలల నుంచి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేస్తాడు. విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి సినిమాలకే కాక ఇతర దర్శకులకు కూడా కథలను రాసి అందిస్తుంటాడు. ఒక్కోసారి తాను రాసిన కథలకు తానే దర్శకత్వం వహిస్తాడు అలా వచ్చిన సినిమానే రాజన్న.రాజన్న కథ బాగున్నా కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఎంత కథ బాగున్నా దానిని తెరకెక్కించే విధానం బాగుంటేనే ఆ సినిమా ఆడుతుందని రాజమౌళి కి బాగా తెలుసు. అందుకే రాజమౌళి తన తండ్రి రాసిన కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తాడు. దర్శకుడిగా విజయేంద్ర ప్రసాద్ విజయం సాధించలేకపోయినా రచయితగా మాత్రం విజయం సాధించారు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గురించి మాట్లాడుతూ ఆసక్తికర సంగతులు తెలిపారు.

తాను చెప్పే కథ మొత్తంలో కేవలం 10 శాతం మాత్రమే రాజమౌళికి నచ్చుతుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపినట్లు సమాచారం.రాజమౌళిని ఇంప్రెస్ చేయడం అంత తేలిక అయిన విషయం కాదని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారట . విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ చేయాలనీ చేస్తే బాగుంటుందని చెప్పిన రాజమౌళికి నచ్చకపోతే ఆ కథ విషయంలో రాజమౌళి తండ్రి మాట కూడా వినరు అని తెలుస్తుంది. రాజమౌళి కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడట. స్క్రిప్ట్ పక్కాగా ఉంటేనే దానిని తెరకేక్కిస్తాడట. రాజమౌళికి ఎప్పుడైతే స్క్రిప్ట్ బాగా నచ్చుతుందో దాని ప్రకారమే ఆ  సినిమాను ఎలా తెరకెక్కించాలని ఆలోచిస్తుంటాడట. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న  ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడట.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో దాగి ఉన్న డౌట్స్ అన్ని తొలగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే సమయానికి ఏపీలో సినిమా థియేటర్స్ పూర్తిగా తెరుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ రాజమౌళి కాంబినేషనులో మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా అడవి ప్రాధాన్యత ఉన్న ఒక అడ్ వెంచర్ సినిమా అని టాక్ వినిపిస్తుంది.దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో ఆ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తరువాత మూవీ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: