గోవా బ్యూటీ ఇలియానా అంటే ఒకప్పుడు తెలుగులో సూపర్ క్రేజ్. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరితో నటించిన ఈ అమ్మడు అంతతి కాలలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. అప్పట్లో ఇలియానా సినిమా సైన్ చేసింది అంటే సినిమా హిట్ అనే టాక్ ఉండేది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇలియానా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళలో వరుస స్టార్ సినిమాలు చేస్తున్న టైం లోనే అమ్మడికి బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టింది. అయితే ఇక్కడ ఛాన్సులు వస్తున్నా సరే కాదనుకుని మరి ఇలియానా బీ టౌన్ కు జంప్ అయ్యింది.

హిందీలో కొన్ని సినిమాలు చేసి అక్కడ పెద్దగా ప్రభావం చూపించని అమ్మడు ఆండ్రూతో కొన్నాళ్లు డేటింగ్ లో ఉండి ఎంజాయ్ చేసింది. ఇక ఫైనల్ గా అతనికి గుడ్ బై చెప్పి సినిమాల్లో బిజీ అవ్వాలని అనుకున్న ఇలియానా ఫైనల్ గా మళ్లీ సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుంది. తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని చివరి సినిమా ఆ తర్వాత స్టార్ ఛాన్సుల కోసం చూస్తున్నా సరే ఎవరు ఇలియానా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు.

సినిమాలు ఎలాగు లేవని ఫోటో షూట్స్ తో తన టాలెంట్ చూపిస్తుంది ఇల్లి బేబ్. తన హాట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు కిక్ ఎక్కిస్తుంది అమ్మడు. లేటెస్ట్ గా అసలేమాత్రం మేకప్ వేసుకోకుండా ఇలియానా నో మేకప్ నో ఫిల్టర్ అనే క్యాప్షన్ తో ఒక ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఇలియానా నో మేకప్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎలాగు సినిమా ఛాన్సులు లేవు కాబట్టి ఇలియానా ఫోటో షూట్స్ తోనే కాలం వెళ్లదీస్తుంది. సినిమాలు చేసినా చేయక పోయినా ఫోటో షూట్స్ తో మాత్రం అభిమానులను అలరిస్తుంది ఇలియానా. ఎప్పటికైనా మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది గోవా బ్యూటీ.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: