చిత్ర పరిశ్రమకి నటవారసులు అడుగు పెడుతుంటారు. అందులో మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోలు అయినా వారు ఉన్నారు. ప్లాప్ లతో సతమతం అవుతూ రాణిస్తున్న వారు కూడా ఉన్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎన్నో సినిమాలను నటించారు. ఆయన నటవారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. నాగార్జున కూడా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

నాగార్జున తరువాత అక్కినేని నాగేశ్వర్ రావు మనవడు సుమంత్ హీరోగా పరిచయమైయ్యేరు. ఆయన మొదట హీరోగా రాణించినప్పటికీ తరువాత అవకాశాలు తగ్గిపోయి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు అడపదడపా సినిమాలు చేస్తున్నారు. తాజాగా సుమంత్ కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక గతంలో కూడా ఇలాంటి వార్తలు రావడంతో ఇది వట్టి గాసిప్ అయ్యి ఉంటుంది అని అంతా అనుకుంటున్నారు.

అయితే నిజంగానే సుమంత్ రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇక సుమంత్, పవిత్ర అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక అతను పెళ్లి చేసుకోబోయే పవిత్ర కలిసి వారి స్నేహితులకు, బంధువులకు వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంపిస్తున్నారు. అయితే వీళ్ళ వెడ్డింగ్ కార్డ్ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ’SP’ అనే లెటర్స్ ను హైలెట్ చేస్తూ వీరి వెడ్డింగ్ కార్డ్ ఉందని చెప్పాలి.

ఇక గతంలో సుమంత్ తొలిప్రేమ(1998) హీరోయిన్ కీర్తి రెడ్డిని 2004 లో వివాహం చేసుకున్నారు. కాగా.. కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండీ సుమంత్ సింగిల్ గానే ఉంటూ వచ్చారు ఆయన. ఇక ఇన్నేళ్ల తరువాత రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని సుమంత్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: