తెలుగులు ఎంతో మంది సినిమాటోగ్రాఫ‌ర్లు ఉన్నారు. వీరిలో సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ కె.ఎస్. గోపాల్ రెడ్డి స్టైల్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది. ఆయ‌న సినిమాల్లో కెమేరా వ‌ర్క్ స‌హ‌జ‌త్వానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. అద్భుత‌మైన విజువ‌ల్స్‌ను తెర‌మీద ఆవిష్క‌రించేలా చేయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. అందుకే ఆయ‌న ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇక నాటి త‌రం నుంచి నేటి త‌రం వ‌ర‌కు ఎంత మంది స్టార్ హీరోలు అయినా సినిమాటోగ్రాఫ‌ర్ విష‌యానికి వ‌చ్చే స‌రికి గోపాల్ రెడ్డి పేరునే రిఫ‌ర్ చేసేవారు.

ఇక గోపాల్ రెడ్డి స్వ‌స్థ‌లం కృష్ణా జిల్లాలోని ఏల‌ప్రోలు. గోపాల్ రెడ్డి తండ్రి సినిమా రంగంలోనే ఉండేవారు. ఆయ‌న విద్యాభ్యాసం ముందుగా విజ‌య‌వాడ‌లో.. ఆ త‌ర్వాత చెన్నైలో జ‌రిగింది. ఇక సినిమా ల్లోకి రావ‌డం చాలా సులువుగానే జ‌రిగింది. తండ్రి సినిమాల్లో ఉండ‌డంతో ఆయ‌న‌తో పాటు చెన్నై వెళ్లిపోయారు. ఇక కెమెరా అసిస్టెంట్ గా వి.నాగేశ్వరరావు .. స్వామి గార్ల దగ్గర పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ఇక సినిమాటోగ్రాఫ‌ర్ గా మారారు. విచిత్రం ఏంటంటే ఆయ‌న క‌థ మొత్తం విని.. క‌థ న‌చ్చితేనే అప్పుడు తాను ఆ సినిమాకు ప‌ని చేస్తాన‌న్న కండీష‌న్ పెట్టేవార‌ట‌.

అహ నా పెళ్లంట సినిమాకి  పనిచేసే టైంలో ఆయ‌న వ‌ర్క్ గ‌మ‌నించిన రాంగోపాల్ వ‌ర్మ శివ సినిమాకు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆయ‌న్నే తీసుకున్నార‌ట‌. ఇక సినిమా మొత్తం పూర్త‌య్యాక ర‌షెస్ చూసిన గోపాల్ రెడ్డిసినిమా మ‌హా అయితే ఎబో యావ‌రేజ్ మాత్రమే అవుతుంద‌ని అనుకున్నార‌ట‌. అయితే శివ అనూహ్యంగా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యి రికార్డులు బ్రేక్ చేసింది. ఈ క్రెడిట్ అంతా వ‌ర్మ‌కే ద‌క్కుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఇక ఆ త‌ర్వాత రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ప‌లు హిట్ సినిమాల‌కు కూడా గోపాల్‌రెడ్డినే కెమేరామెన్‌గా పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: