దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగి పోయింది. దానికి కారణం బాహుబలి సినిమా. ఈ సినిమా భారీ  విజయాన్ని నమోదు చేసింది. బాహుబలి వల్ల తెలుగు సినిమా అంటే ప్రపంచ స్థాయికి చేరింది. హాలీవుడ్ టెక్నీషియన్ లు తెలుగు సినిమాలో పని చేయటానికి ఎంతో వేచి ఉండే పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది.భారతీయ సినీ ప్రపంచంలో మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో బాహుబలి నెలకొల్పిన రికార్డులు చాలానే వున్నాయి. బాహుబలి తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న రాజమౌళి.. తన మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో సృష్టించుకున్నారు . ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి “RRR” సినిమా చేస్తుండగా ఆ సినిమా కూడా బాహుబలికి ఏ మాత్రం తగ్గకుండా రూపొందిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమా బాహుబలిని మించి పోయేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరిసీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరంభీమ్ గా కనిపించబోతున్నారు. అలియాభట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.రాజమౌళి rrr తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా అడవి నేపథ్యంలో సాగె చిత్రంగా దీనిని రూపొందించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ఎక్కువ శాతం సౌత్ ఇండియా సూపర్ స్టార్ తలైవా రజని కాంత్ తో రాజమౌళి సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ గా టాక్ వినిపిస్తుంది.రజనీకాంత్ తన సినిమా ప్రస్థానములో 175 వ సినిమాగా ఈ సినిమా  చిత్రీకరణ జరగనున్నట్లు సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో ఒక పవర్ ఫుల్ మాస్ యాక్షన్ మూవీ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.అంతేకాకుండా ఈ సినిమాని వి క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ సంస్థ నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడి గా ఈ సినిమాకి పని చేయనున్నట్లు 2023 రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల అవుతుందని తాజా సమాచారం. రజినీ 175 సినిమా కావడంతో చాలా ప్రత్యేకంగా ఉండటం కోసం .. రాజమౌళి దర్శకత్వంలో రజనీ సినిమా చేయటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తన అల్లుడు ధనుష్ దర్శకత్వంలో రజనీకాంత్ 175 వ సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చిన  అవి నిజం కాదని తేలిపోయింది.త్వరలోనే రాజమౌళి సినిమాకి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి, rrr కంటే అతిపెద్ద భారీగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని సమాచారం. రజినీకాంత్, రాజమౌళి కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: