క‌రోనా ప్ర‌భావంతో మాల్స్, పబ్బులు, సినిమా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. క‌రోనా సెకండ్ వేవ్ అనంత‌రం మాల్స్ ప‌బ్బులు వెంట‌నే రీ ఒపెన్ అయ్యాయి. కానీ సినిమా థియేట‌ర్లు మాత్రం చాలా రోజుల త‌రువాత తెరుచుకున్నాయి. దీనిపై నాచుర‌ల్ స్టార్ నాని స్పందించారు. మాల్స్‌, ప‌బ్బుల‌కు వెళ్లి మాస్కులు తీసి ఎంజాయ్ చేసేవాళ్ల కంటే థియేటర్ల‌లో సినిమాలు చూసేవాళ్లే క్షేమం అంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్యదేవ్ - ప్రియాంకా జవాల్కర్ జంటగా శరణ్ కొప్పిశెట్టి తెరకెక్కించిన `తిమ్మరుసు` ప్రమోషనల్ కార్యక్రమంలో ఈ పిల్ల జ‌మిందార్ ఆయ‌న మాట్లాడారు.

పబ్బులు క్లబ్బులు మాల్స్ కి వెళ్లి అక్కడ మాస్కులు తీసేసి చాలా మంది గొప్పగా మాట్లాడుతున్నార‌ని, దానికంటే థియేటర్లలో కూచున్న ప్రేక్ష‌కుడు చాలా సురక్షితమ‌ని చెప్పారు. థియేటర్లలో  మాస్క్ రూల్ ని పాటిస్తున్నార‌ని, పైగా ఒకేవైపు అంటే తెరవైపు చూస్తారు, పక్కవాళ్లతో మాట్లాడరని అన్నారు. కానీ థియేటర్లు అంటు చిన్న చూపు చూడ‌డం స‌రైంది కాద‌న్నారు. కరోనా వస్తోందని అన్నిటి కంటే ముందుగా మూసి, చివరిలో తెరిచేది థియేటర్లేన‌ని. ఈ చిన్న చూపు ఎందుకు? అన్నింటితో స‌మానంగా వీటిని తెరవొచ్చు కదా అని ప్రశ్నించారు.


ఈ పరిస్థితి ఇదే విధంగా కొన‌సాగితే థియేటర్ల వ్యవస్థ నాశనం అవుతుద‌ని, లక్షలాది కార్మికులు రోడ్డున పడి, ఉపాధి పోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుతం విడుద‌ల అవుతున్న‌తిమ్మరుసు థియేటర్లకు ఆక్సిజన్ ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. సినిమా అనేది మనకు ఎంతో వినోదం ఇస్తుంది. వినోదం ఎక్కువగా ఉంటే  ప్రజలు అంత ఆనందంగా ఉంటార‌న్నారు. థియేటర్లో సినిమా చూడటం అనేది మన సంస్కృతిలో భాగమ‌ని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యం చాలా ముఖ్యమ‌ని అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే సినిమాని ఆస్వాదిద్దామ‌ని కోరారు. క‌రోనా థర్డ్ వేవ్ లాంటివి రాకుండా.. అన్ని సినిమాలను థియేటర్ లలో అందరం కలిసి ఆస్వాదించాలని నాని కోరారు.


థియేటర్ల వ్యవస్థ ఇలానే ఉంటే నాశనమవుతుందని నాని చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వాలు సీరియస్ గా తిసుకుంటాయా లేదా చూడాలి. తెలంగాణలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని చొరవతో థియేట‌ర్ల‌కు కొంతవరకూ  వెసులుబాటు కల్పించారు. కానీ ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం థియేటర్ల సమస్యలపై ఇన్నాళ్లు స్పందించకపోవడంపై సినిమా రంగం వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: