మార్తాండ్ కె వెంకటేష్ తెలుగు సినిమా ప్రముఖ ఎడిటర్ లో ఒకరు. ఈయన కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అల్లరి ప్రేమికుడు' సినిమా ద్వారా ఎడిటర్ గా మారారు. ఈయన ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. దీనిలో భాగంగా యాంకర్ మీకు 'అల్లరి ప్రేమికుడు' సినిమా అవకాశం ఎలా వచ్చింది అని అడగగా..? నేను కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'కూలి నెంబర్ వన్' సినిమాకు అసిస్టెంట్ గా పని చేశాను.


సినిమా దర్శకుడు కె .రాఘవేంద్ర రావు నన్ను పిలిచి సినిమా ఎలా అనిపించింది అని అడిగాడు. నేను ఏమాత్రం మొహమాటం లేకుండా సినిమా బాగానే ఉంది కానీ హీరో క్యారెక్టరైజేషన్ నాకు నచ్చలేదు సార్ అని చెప్పాను. ఎందుకు అని ఆయన అడిగారు దానికి నేను హీరో హీరోయిన్ ని మత్తు మందు కలిపిన పాలు ఇచ్చి మోసం చేయడం హీరోయిజం ఎలా అవుతుంది సార్ అని చెప్పాను. దానికి ఆయన నీ ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చింది ఇలాగే ఉండు పైకి వస్తావు అన్నాడు. ఆ తర్వాత ఆయనే నాకు 'అల్లరి ప్రేమికుడు' సినిమా తో పాటు వరుసగా పది సినిమాల ఆఫర్లు కూడా ఇచ్చారు. అలాగే నేను ఏ సినిమా చూసినా ఆ సినిమా బాగుంది ,బాగోలేదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తాను. దానిని కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటే మరి కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు.


ఈ సందర్భంలోనే దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓ మై ఫ్రెండ్' సినిమా బాగాలేదు అని, వారిద్దరిని చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ లా అనిపించడం లేదని, లవర్స్ లా కనిపిస్తున్నారు ఈ సినిమా ఆడదు అని ప్రొడ్యూసర్  కి డైరెక్టర్ కి చెప్పాను. ఆ తర్వాత  అతని నెక్స్ట్ సినిమా నాకు ఇవ్వలేదు. ఇదే సందర్భంలో 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమా గురించి కూడా దిల్ రాజు కి సినిమాలో ఎందుకు హీరో హీరోయిన్ ని లవ్ చేస్తున్నాడు. హీరోయిన్ ఎందుకు హీరోని ఇష్టపడుతుందో సీన్లు క్లారిటీ గా లేవు అని చెప్పడంతో నలభై శాతం వరకు మళ్లీ రూట్ చేశారు అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: