బాలీవుడ్ ను మాత్ర‌మే కాకుండా యావ‌త్ దేశాన్ని షేక్‌ చేస్తున్న రాజ్ కుంద్రా వ్యవహారంలో ఇప్పుడు మ‌రో హీరోయిన్ పేరు కూడా వినిపిస్తోంది. ఆ హీరోయిన్‌కు మ‌న తెలుగు సినిమాకు కూడా లింకులు ఉన్నాయి. స‌ద‌రు హీరోయిన్ ఎవ‌రో కాదు ఫ్లోరా షైనీ. ఆమె ఎవ‌రో కాదు మ‌న తెలుగు వాళ్ల‌కు 20 సంవ‌త్స‌రాల క్రితం ఆమె ఆశా షైనీగా ప‌రిచ‌యం. మ‌నం ముద్దుగా ల‌క్స్ పాప అని పిలుచుకుంటాము. బాల‌య్య హీరోగా బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన న‌ర‌సింహానాయుడు సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఆ సినిమాలో ల‌క్స్ పాప ల‌క్స్ పాప అనే పాట‌కు బాల‌య్య‌తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆ సినిమా వ‌చ్చి 21 సంవ‌త్స‌రాలు అవుతున్నా ఇప్ప‌ట‌కీ తెలుగు ప్రేక్ష‌కులు ఆ పాట‌ను.. ఆశా షైనీ రోల్‌ను మాత్రం మ‌ర‌చిపోరు.
ఆ త‌ర్వాత ఆమె తెలుగులో ప‌లు సినిమాల్లో న‌టించింది. వెంక‌టేష్ నువ్వు నాకు నచ్చావ్ - ఆ ఇంట్లో - జ‌గ‌ప‌తి బాబు ప‌క్క‌న ర్దుకుపోదాం రండి సినిమాల‌తో మంచి గుర్తింపే ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత ఆమె బాలీవుడ్‌కు చెక్కేసి అక్క‌డ కొన్ని సినిమాలు చేసింది. ఇక తాజాగా శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాను పోలీసులు పోర్న్ వీడియోల వ్య‌వ‌హారంలో అరెస్టు చేయ‌డంతో ప‌లువురు మోడల్స్‌, హీరోయిన్ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఈ లిస్టులోనే ప్లోరా శైనీ పేరు కూడా వ‌చ్చింది.

రాజ్ కుంద్రా.. ఉమేశ్ కామత్ లు జరిపిన ఒక వాట్సాప్ చాటింగ్ లో ఫ్లోరా షైనీ పేరు ఉండ‌డంతో ఇప్పుడు నేష‌న‌ల్ మీడియా అంతా ఆమెను ఫోక‌స్ చేస్తోంది. రాజ్ స్నేహితుడు అయిన ఉమేశ్‌తో ఆమెకు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని టాక్ . దీంతో రాజ్ కుంద్రా చేసిన కొన్ని వీడియోల్లో ఆమె కూడా ఉన్నారా ?  అన్న సందేహాలు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌లు చిలువ‌లు ప‌ల‌వలుగా రావ‌డంతో ఆమె ఏకంగా ఐదు నిమిషాల వీడియో రిలీజ్ చేసి మ‌రీ ఇవ‌న్నీ అవాస్త‌వాలు అని కొట్టి ప‌డేసింది. త‌న‌కు రాజ్ కుంద్రా, ఉమేష్ తో ఎలాంటి స‌న్నిహిత సంబంధాలు లేవ‌ని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: