`ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం` కొద్ది రోజుల క్రితం వ‌చ్చిన పాట‌లు పాటలు సంగీత అభిమానుల‌ను ఎంత‌గానో అల‌రించాయి. కాసేపు నువ్వు మాటాడొద్దు, చుక్క‌ల చున్నినే అంటూ వ‌చ్చిన పాట‌లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో `రాజావారు రాణిగారు' ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం, 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్ర‌మోద్ - రాజు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


 ఆగస్టు 6న ఈ సినిమాని థియేటర్లలో ఈ సినిమా విడుద‌ల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్ర‌మోష‌న్‌ చిత్రాలు, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ట్రైల‌ర్‌లో 'పది రూపాయలు సంపాదిస్తే కానీ మన కడుపున పుట్టినవాడు కూడా విలువ ఇవ్వడు' అని సాయి కుమార్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇన్నాళ్లూ ఇదొక యూత్ కామెడీ ఎంటర్టైనర్ అనుకునేలా ప్రమోషనల్ కంటెంట్ చూపిన సినిమా మేకర్స్.. ట్రైలర్ లో మాత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్ ని చూపించారు. ఇందులో కిర‌ణ్ తండ్రి పాత్రలో సాయి కుమార్ కనిపిస్తున్నారు. ఓ కార‌ణం వ‌ల్ల‌ తండ్రి అంటే పడని వ్యక్తిగా హీరో ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే సమయంలో కాలేజీలో హీరోయిన్ త‌న ప్రేమను ఒప్పించ‌డం కోసం హీరో పడే పాట్లు కూడా ట్రైలర్ లో చూపించారు. చివరకు తండ్రీకొడుకులు ఒకటయ్యారా, హీరోయిన్ ప్రేమను హీరో సాధించాడా? అనేవి ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


  ఎస్ ఆర్‌ క‌ళ్యాణమండంపం చిత్రానికి హీరో కిర‌ణ్ స్వ‌యంగా క‌థ‌ - స్క్రీన్ ప్లే అలాగే డైలాగ్స్ అందించ‌డం విశేషం. కిరణ్ నటనలో మొదటి సినిమా కంటే చాలా మెరుగుపడినట్లు క‌నిపిస్తోంది. ఇందులో తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్, టీఎన్నార్, అరుణ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. మొత్తం మీద కామెడి తో పాటుగా ఎమోషన్స్ కలబోసిన  ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం ట్రైలర్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం సమకూర్చారు. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందించాడు. కరోనా రెండో వేవ్ పరిస్థితుల తర్వాత వచ్చే నెల అగ‌స్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్రేక్ష‌కుల నుంచి ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం ఏ విధంగా ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: