ఇటీవల కాలంలో చాలావరకు కథలన్నీ క్రీడలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నాయి . అలా దాదాపుగా వచ్చిన సినిమాలన్నీ, మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా హీరోలకు కూడా మంచి పేరు ను  తెచ్చిపెడుతున్నాయి. ఇలా ఎంతో మంది హీరోలు క్రీడలను ప్రధానాంశంగా ఎన్నుకొని, సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన, గుర్తింపును సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, మెగా పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ కూడా క్రీడా విభాగంలో ఒక సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారట. షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కానీ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చిందట. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి , మగధీర సినిమాతో స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తర్వాత గోవిందుడు అందరివాడేలే, ఆరెంజ్, ఎవడు, బ్రూస్ లీ, రంగస్థలం వంటి  సినిమాలు ఎన్నో చేసి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పోతే రామ్ చరణ్ బాబు బాబాయ్  అయిన పవన్ కళ్యాణ్ తో  బంగారం సినిమా తీసిన   డైరెక్టర్ ధరణి, రామ్ చరణ్ తో  క్రీడా విభాగంలో లో ఫుట్ బాల్ క్రీడ నేపథ్యంలో,  ఒక సినిమాను ప్లాన్ చేయడం జరిగింది. ఆ సినిమాకు మెరుపు అనే టైటిల్ కూడా పెట్టారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని ఎంచుకున్నారు. ఇక ఫుట్ బాల్  కోచ్ గా నానాపటేకర్ కూడా ఎన్నికయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది .కొంత భాగం పూర్తి అయిన తర్వాత తిరిగి ఆర్థిక సమస్యలు రావడంతో, నిర్మాత బడ్జెట్ ప్రాబ్లం అని చెప్పి, సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపివేశారు. అందుకే ఫుట్ బాల్  ప్లేయర్ గా మన ముందుకు రాలేక పోయాడు రామ్ చరణ్. తన అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు ఈ సినిమా కోసం. ఒకవేళ ఫుట్ బాల్  ప్లేయర్ గా మన ముందుకు వచ్చి ఉండుంటే, రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగేది అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: