కొంత మంది హీరోయిన్ లను తెరమీద చూసినట్లుగా బయట చూస్తే ఏమాత్రం గుర్తుపట్టలేరు.  మేకప్ లు అద్దుకుని సినిమా తెరపై బాగా కనిపించాలనే ఉద్దేశంతో హీరోయిన్ లు రకరకాలుగా తయారవుతుంటారు. కానీ ఇంట్లో నార్మల్ గా అందరూ అమ్మాయిలు ఉండే విధంగానే ఉంటారు. తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానా మేకప్ లేకుండా ఓ ఫోటోని తన సోషల్ మీడియాలో విడుదల చేసి అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. 

రామ్ హీరోగా నటించిన దేవదాసు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అప్పట్లో కుర్రకారు గుండెల్లో గుబులు లేపి తన లేత అందాలతో ప్రభంజనం సృష్టించింది. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కోటి రూపాయల పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్ గా రికార్డు సృష్టించింది ఇలియానా. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో అటుగా వెళ్ళింది. అక్కడ కూడా కొన్నాళ్లపాటు వరుస సినిమాలు చేసి స్టార్ హీరోలతో నటించి బిజీగా గడిపింది. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు తగ్గాయి. 

మధ్యలో బరువు పెరగడంతో ఆమెపై కొందరు బ్యాడ్ కామెంట్స్ చేశారు. తెలుగులో ఆమె రీ ఎంట్రీ చిత్రంగా చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో ఆమెను చూసిన ఆమె అభిమానులు షాక్ అయ్యారు. జీరో సైజ్ హీరోయిన్ అనగానే అందరికీ టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా గుర్తుకు వచ్చేది కానీ ఇప్పుడు ఏంటి ఇలా తయారు అయ్యింది అని కామెంట్స్ రావడంతో ఇలియానా మళ్ళీ బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి  జీరో సైజుకు వచ్చేసింది అని ఇప్పుడు ఆమె విడుదల చేసిన ఫోటో ని బట్టి తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో కు విపరీతమైన ఆదరణ దక్కుతుంది ఎలాంటి మేకప్ కూడా లేకపోవడంతో కెమెరా టాప్ యాంగిల్ లో ఉండడం వల్ల ఆమెను గుర్తు పట్టలేకుండా ఉన్నామని కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: