కోలీవుడ్ లో  నాచురల్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన హీరో  అజిత్.. తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. మొదట తక్కువ బడ్జెట్ లోనే సినిమాలను చేస్తూ, ఆ తర్వాత తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ, ప్రస్తుతం అత్యధిక బడ్జెట్ తో సినిమాలు చేస్తున్న హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాదు అజిత్ తీసే సినిమాలు దాదాపుగా అన్ని భాషలలో విడుదల అవుతున్నాయి. అయితే ఇటీవల వాలిమై  సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా  విడుదలకు సిద్ధంగా ఉన్న సందర్భంగా ఆయన ఉత్తర  భారతదేశం అంతా బైక్ టూర్ వెళ్లారు.ఇక  అక్కడ దిగిన ఫోటోలు అన్నీ తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

ఇకపోతే ప్రస్తుతం అజిత్ ఇంత స్టార్ పొజిషన్ ను  అనుభవించడానికి కారణం ప్రముఖ హీరోయిన్ హీరో అని అప్పట్లో చాలా మంది చెప్పేవారు. ఇలా ఎందుకు అంటే, మొదట అజిత్ హీరోగా వచ్చిన చిత్రం పెళ్లి పుస్తకం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న హీరా నటించడం గమనార్హం. ఇక ఈ సినిమా షూటింగ్ సెట్లో  అజిత్ .. హీరా కు పడిపోయాడు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆయన హీరా కు  ప్రేమలేఖలు కూడా రాయడం మొదలుపెట్టాడు.

ఒకరినొకరు బాగా దగ్గరై ప్రేమలో పడ్డారు. ఈ కారణం చేతనే హీరా తనకు ఉన్న క్రేజ్ ను  మొత్తం ఉపయోగించి, పెద్ద పెద్ద డైరెక్టర్ల సినిమాలలో నటించే అవకాశాన్ని ఇప్పించింది. అంతే కాదు ఒక పక్క ఇతర స్టార్ హీరోలతో నటిస్తూ, మరో పక్క అజిత్ కోసం తన డేట్స్ ను కూడా సర్దుబాటు చేసుకునేది. అంతలా వీరి  ప్రేమ అప్పట్లో కొనసాగింది. అంతేకాదు రొమాన్స్ సన్నివేశాల్లో కూడా నటించడానికి ఆమె వెనుకాడేది కాదు. పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు వీరిద్దరు. అంతేకాదు డేటింగ్ లో కూడా ఉన్నామని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని  కూడా చెప్పేశారు.

కానీ కొద్ది రోజుల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఈ విషయంపై అజిత్ ను అడగగా,  ఆమె డ్రగ్స్ కి అడిక్ట్ అయింది.. అందుకే వదిలేసా అని చెప్పాడు. ఆ తర్వాత మరో హీరోయిన్ స్వాతి ను ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న హీరా, ఇతరులను ఇష్టపడడానికి నా పైన ఇలాంటి నిందలు వేయాల్సిన అవసరం లేదు.. అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత ఆమె వేరొకరిని వివాహం చేసుకుంది. అజిత్ కూడా హీరోయిన్ శాలిని వివాహం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: