తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు ఈ  సారి కూడా మాంచి ర‌స‌వ‌త్త‌రంగానే జ‌రిగే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే తాను మెగా కాంపౌండ్ మ‌ద్ద‌తుతో ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్టు బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ప్ర‌క‌టించారు. ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి అండ‌దండ‌ల‌తో ప‌లువురు రంగంలోకి దిగిన వాతావ‌ర‌ణ‌మే మా లో క‌నిపిస్తోంది. ఇక ఇటు ప్ర‌కాష్ రాజ్‌కు మెగా కాంపౌండ్ మ‌ద్ద‌తు ఉంద‌న్న వార్త‌ల‌తో అటు నంద‌మూరి బాల‌య్య ఎంట‌ర్ అయ్యాడు. ఆయ‌న మా లో లోక‌ల్‌, నాన్ లోక‌ల్ అంటూ ఏదీ లేదంటూనే మంచు విష్ణుకు స‌పోర్ట్ అని చెప్ప‌క‌నే చెప్పేశారు.

ఇక విష్ణు ముందు నుంచి సైలెంట్ గా అంద‌రిని క‌లుపుకుని పోతూనే .. తెర వెన‌క త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలోనే వ్యూహాత్మ‌కంగా న‌ట‌ర‌త్న బాల‌కృష్ణ మా ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని చెప్పాడు. సినీ పెద్ద‌లు మా అధ్యక్ష ప‌ద‌విని ఏక‌గ్రీవం చేయాల‌ని అనుకుంటే.. ఆ న‌టుడికే తాను మ‌ద్ద‌తు ఇస్తాన‌ని కూడా విష్ణు చెప్పాడు. విష్ణు పెట్టిన మెలిక‌తో మా పెద్ద‌లు, ఇటు మెగా కాంపౌండ్ అంతా ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ఉన్నారు. వారు అవున‌ని.. కాద‌నీ చెప్ప‌లేక‌పోతున్నారు.

ఇక మా పెద్ద‌లు కృష్ణ- కృష్ణంరాజు- చిరంజీవి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌కు స‌హ‌క‌రిస్తే తన‌కు అభ్యంత‌రం లేద‌ని... తాను ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని కూడా చెప్పేశాడు. బాల‌య్య హ‌యాంలో సీనియ‌ర్ల‌కు మా అధ్య‌క్షుడిగా ప‌నిచేసే అవ‌కాశం రాలేద‌ని.. అందుకే ఆ టైంలో ఉన్న వారికి తాను అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతున్నాన‌ని విష్ణు చెప్పారు. ఒక వేళ ఏక‌గ్రీవం కాని ప‌క్షంలో తాను మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని విష్ణు చెపుతున్నారు. ఏదేమైనా మా ఎన్నిక‌లు మాత్రం ఏదో సింపుల్‌గా ముగిసేలా లేవ‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: