శిల్పా శెట్టి.. తన భర్త అలాగే వ్యాపార ఆయన రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా అశ్లీల రాకెట్ కేసులో అరెస్ట్ చేయబడ్డాడు. జూలై 19 వ తేదీన ఆయన తో పాటు మరో 11 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే శిల్పాశెట్టికి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదని తెలిపింది. ఈ కేసులో ఎవరైతే పాల్గొన్నారో , ఆ వ్యక్తుల ఖాతాల్లో జరిగిన లావాదేవీల పై దర్యాప్తు జరపడానికి ,ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లు ఫోరెన్సిక్ ఆడిటర్ లను నియమించినట్లు సమాచారం. వీరు ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. అంతే కాదు ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి ఖాతా లావాదేవీల ను పరిశీలించడం కోసం ఇంకా కొంచెం సమయం పట్టవచ్చు అని , ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరికీ క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే లేదని అధికారులు స్పష్టం చేశారు.

అయితే రాజ్ కుంద్రా  అశ్లీల రాకెట్  వ్యాపారం నడుపుతున్నాడని, ఇతడికి విరుద్ధంగా, సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రముఖ నటుడు షెర్లిన్ చోప్రా ను అధికారులు పిలిచినట్లు పేర్కొనడం జరిగింది.. ఇకపోతే న్యూఫ్లిక్స్ యాప్ యొక్క యజమాని  అరవింద్ శ్రీవాస్తవ అలియాస్  యస్ ఠాకూర్.. సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో వారు స్వాధీనం చేసుకున్న తన బ్యాంకు ఖాతా ను విడుదల చేసి, తనకు ఇవ్వాలని ముంబై పోలీసులకు లేఖ రాశాడు. అయితే ముంబై పోలీసులు మాత్రం.. ఇతనిని ముందు దర్యాప్తులో పాల్గొనాలని, తప్పకుండా ఇక్కడికి వచ్చి తీరాలని కోరినట్లు క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలపడం జరిగింది.

అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఠాకూర్ అలాగే రాజ్ కుంద్రా మధ్య ఎటువంటి సంబంధం లేదు అని. ఇక ఈ కేసులో ఎవరినైతే పోలీసులు అరెస్ట్ చేశారో, వారందరూ చెప్పడంతో ఈ కేసు ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. ఇకపోతే ఇప్పటి వరకే బాంబే హైకోర్టు కుంద్రా బెయిల్ పిటిషన్ పై  విచారణను గురువారం వరకు వాయిదా వేసింది. కుంద్రా తో పాటు అతని సహచరుడు ర్యాన్ తోర్పే ను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది.

ముంబై పోలీసులు కుంద్రాను ప్రధాన నిందితుడిగా భావించి, అతని పై సెక్షన్ 420 ( మోసం), సెక్షన్ 292 అలాగే సెక్షన్ 293 ( పోర్న్ ) సెక్షన్ 34 ( ఉమ్మడి ఉద్దేశం)  అలాగే ఐపీసీ తోపాటు ఐటి చట్టం మహిళలపై అసభ్యంగా ప్రవర్తించాడనే కేసులో అరెస్ట్ చేయడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: